సప్తముఖ రుద్రాక్షమాలధారణ: ధరిస్తే అమోఘమైన ఫలితాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైష్ణవ సాంప్రదాయము ప్రకారము ఈ రుద్రాక్ష శేష నాగ స్వరూపముగా పూజిస్తారు. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క సర్పముగా భావిస్తారు. అవి అనంత, కర్కాటక, పుండరీక, తక్షక, విశ్లభన, కరిష్ణా, శంఖచూడుడు. ఇవి అత్యంత శక్తివంతమైన సర్పాలుగా భావిస్తారు.

ఏడు ముఖాల రుద్రాక్షసప్తమాతృకలు, సప్తఋషులు, సూర్యునికి ప్రతీక దీనిని ధరిస్తే లక్ష్మీకటాక్షము సిద్ధిస్తుంది. శుభులై పద్ధతి ప్రకారము ధరిస్తే, జ్ఞానము, సంపద లభిస్తుంది. బంగారము దొంగిలించిన పాపము తొలగిపోతుంది. ముఖ్యముగా దీపావళి పర్వదినము నందు లేదా శుక్రవారము ఉదయము 6గం|| నుండి 7గం||లోపుగా శ్రేష్టం - సాధారణముగా శనివారము, బ్రాహ్మీముహూర్త సమయములో ధరించగలరు.

A story on Saptamukhi Rudraksha Maladharana

ఈ రుద్రాక్షధారణ ముందర శ్రీలక్ష్మీ సహస్రనామపూజ లేదా లక్ష్మీ అష్ణోత్తర పూజ చేసి ధరించవలెను మాలధారణ చేయనప్పడు రుద్రాక్ష మంత్రమును 11మార్లు ధ్యానించవలెను. లేదా 5వ మంత్రమును 550 మార్లు జపించవలెను ముఖ్యముగా ఏలినాటి శని అనేక భాధలు పడుచున్నవారు (గత 7గం|లుగా బాధపడుచున్నవారు) దీని ధారణ వలన బాధలు నుండి విముక్తులు కాగలరు.

ఈ మాలధారణ చేసినవారికి సర్పకాటు భయం ఉండదు. అంతేగాక సర్పాలకు అధిపతి అయిన పరమశివుని అభయహస్తం ఉంటుంది. దీనిని ధరించినవారు మనస్సులో సంపద నిండుగా వున్నట్లు భావించబడతారు. ఈ మాలధారణ చేసినవారికి పాపములు అంటవు. పేదరికము దరిచేరదు సంపద, పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం సొంతమగును. దీనిధారణవలన అకాలమరణాన్ని నివారిస్తుంది. వశీకరణకు, లైంగికశక్తి పెరుగుతుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Saptamukha Rudraksha Maladharana.
Please Wait while comments are loading...