వాస్తు ప్రకారం ఇంట్లో సంపద నిలవాలంటే ఈ చిన్న పనులు చేస్తే చాలు!
ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనారోగ్యం, ఆర్థిక నష్టం, ఇతరులతో గొడవల్లాంటి తరుచుగా తలెత్తుతుంటాయి. అనేక విధాలుగా సమస్యలు చుట్టుముడతాయి. అయితే వాస్తుకు సంబంధించి కొన్ని సులభమైన చిన్న చిన్న చిట్కాలు పాటించడంద్వారా మన జీవితాలను పూర్తిగా మార్చుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంనేది తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేచిన తర్వాత పసుపును నీటిలో కరిగించి తమలపాకుతో ఇల్లు మొత్తం ఆ నీటిని చల్లుకోవాలి.
ఇదేవిధంగా గంగాజలం ఉంటే చల్లుకోవాలి.
ఇలా చేయడంవల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
వాస్తు దోషాలుండవు.

దక్షిణం వైపు నిద్రిస్తే నిద్రలేమి నుంచి బయపడతారు.
స్వభావంలో మార్పు వస్తుంది.
ఇంటికి ప్రధాన ద్వారానికి రెండువైపులా అశోక చెట్లను నాటితే వంశం అభివృద్ధి చెందుతుంది.
ఈశాన్యంలో చెత్త ఉండకూడదు.
భారీ వస్తువులు ఉండకూడదు.
ఈశాన్యంలో బ్రహ్మ ముహూర్తంలో మంచి శుభ సమయాన్ని చూసుకొని స్ఫటిక శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించాలి.
లక్ష్మీదేవికి ప్రతీక అయిన ఈ యంత్రం వాస్తు దోషాలను తొలగిస్తుంది.
ఇంట్లో ఎండిపోయిన పూలు, ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు.
వాటిని బయట పారేయాలి.
కుండీలో పువ్వులు వాడిపోతే కొత్తవాటిని నాటాలి.
ఎండినవాటిని బయట పడేయాలి.
ఈశాన్యంలో తులసి మొక్కను నాటాలి.
ప్రతిరోజు సాయంత్రం తులసి కింద నెయ్యి దీపాన్ని వెలిగించాలి.
నెయ్యి స్వచ్ఛంగా ఉండాలి.
తులసి లక్ష్మీదేవి స్వరూపం.
కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది.
మతానికి సంబంధించిన పుస్తకాలను పశ్చిమ దిక్కులోనే ఉంచాలి.
మంచం లోపల, పరుపు లోపల, దిండు కింద పెట్టకూడదు.
ఇలా చేస్తే అశుభం.
పూజాగదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి, గంట మోగించాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోతుంది.
శంఖాన్ని ఇంట్లో ఊదితే అదృష్టం కలిసివస్తుంది.
రోజు దేవతామూర్తులకు పూలు మార్చాలి. వాటినే ఉంచకూడదు.
దేవతామూర్తుల పటాలు ఒకదానికి మరొకటి ఎదురుగా ఉండకూడదు.
చీపురును తలుపు దగ్గర ఉంచకూడదు.
దీనివల్ల వాస్తు దోషం వస్తుంది.
చీపురుకు మన కాలు తగలకూడదు.
చీపురు పెట్టే స్థలంపై బరువైన వస్తువు ఉండకూడదు.
మంచి ఆహ్లాదకరమైన ఫొటోలను పెట్టడంవల్ల మానసిక సమస్యల నుంచి బయటపడతారు.
హింసాత్మక చిత్రాలు ఉండకూడదు.












Click it and Unblock the Notifications