వాస్తు ప్రకారం తల ఎటువైపు పెట్టి పడుకోవాలి?

రాత్రివేళ మనం నిద్రించే నిద్రకు కూడా వాస్తు ఉంటుందనే విషయం తెలుసా? ఎందుకంటే కొంతమంది ఎటువైపు పడితే అటువైపు తల పెట్టి పడుకుంటారు. కానీ అలా చేయకూడదు. ప్రధానంగా నిద్రపోయే సమయంలో మన తలను ఉత్తరంవైపు అసలు పెట్టకూడదు. వినాయకచవితి పండగ చేసుకొనేటప్పుడు అందరికీ దీన్ని గురించి తెలిసే ఉంటుంది. ఉత్తరం వైపు నిద్రిస్తున్న గజాసురుడిని సంహరించి, అతని తలను తీసుకువచ్చి పరమేశ్వరుడు తన బిడ్డకు తల అతికిస్తారు. దీంతో వినాయకుడు అనే పేరుతో లోకవిదితం అవుతాడు. మనం నిద్రపోయే దిశ మన ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సంపదను సూచిస్తుంది.

రాత్రివేళ నిద్రించేటప్పుడు తల ఉత్తరం వైపు పెట్టకూడదు.
ఆ ఒక్క దిక్కు మినహా తూర్పు, పడమర, దక్షిణం వైపు తల పెట్టుకోవచ్చు.
వాస్తు ప్రకారం దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం చాలా మంచిది.
దీనివల్ల గాఢమైన నిద్ర పడుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
దీర్ఘాయుష్షు లభిస్తుంది.
దక్షిణ దిశలో మనిషి శరీరంలో ఉండే శక్తికి, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య సమతుల్యత ఏర్పడుతుంది.

According to Vastu Shastra in which direction should you place your head while sleeping at night

దక్షిణం తర్వాత తూర్పు ఉత్తమం.
విద్యార్థులు, మేథస్సుకు సంబంధించిన పనులు చేసేవారు ఈ వైపు తలపెట్టాలి.
ఏకాగ్రత పెంచడంతోపాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సానుకూల శక్తిని పెంచుతుంది.

దక్షిణం, తూర్పు తర్వాత పడమర మంచిది.
ఈ దిశలో తల పెట్టి పడుకుంటే పేరు, ప్రఖ్యాతులు వస్తాయి.
అయితే కొన్నిసార్లు మనసు సంచలనానికి గురవుతుంది.

వాస్తు ప్రకారం ఉత్తరంవైపు తల పెట్టకూడదు.
భూమి ఉత్తర ధ్రువం, మన తల ఒకదానికొకటి వకర్షించుకుంటాయి.
దీనివల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి పీడకలలు వస్తాయి.
నిద్ర లేమి ఉంటుంది. తొలనొప్పి వస్తుంది.

పైన దూలం ఉంటే అక్కడ పడుకోకూడదు.
దీనివల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు.
తలుపునకు ఎదురుగా కాళ్లు పెట్టి పడుకోకూడదు.
నిద్రించే సమయంలో శరీరం అద్దంలో కనపడకూడదు.
ఇలా చేస్తే అనారోగ్యానికి సూచిక.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+