వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ ఆదిశంకరాచార్యుల జాతకం ఇదీ...

ఏప్రిల్ 30వ తేదీ శంకరాచార్యులు పుట్టిన రోజు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏప్రిల్ 30వ తేదీ శంకరాచార్యులు పుట్టిన రోజు. ఆయన జీవితాన్నికొన్ని గ్రహాల నిర్ణఇస్తాయని చెప్పలేము కానీ, ఆయన పండితుడిగా , కవిగా, అద్వైత స్తాపకునిగా కావడానికి కొందరు జ్యోతిష్కులు చెప్పిన అంశాలని చెప్పవచ్చు.

ఆధారాలు -

పండితునిగా ఖ్యాతిపొందిన ఒక భారతీయ చరిత్రకారుడు తాను వ్రాసిన లైఫ్ అండ్ టీచింగ్స్ ; ఆఫ్ శంకరాచార్యా" అనే గ్రంథంలో ఆదిశంకరులు క్రీ.శ ఏడవ శతాబ్దం మధ్యనుండి 9వ శతాబ్ద ప్రారంభంలో జన్మించి ఉంటారని తెలియచేసారు. ఏఏ కారణాలచే వీరు ఈ అభిప్రాయానికి వచ్చింది వివరణను ఇవ్వలేదు. ప్రొఫసర్ బి.సూర్యనారాయణరావుగారి మాటలలో "శృంగేరీ మఠంవారి గురుపరంపర పట్టిని ప్రామాణికంగా తీసుకుని అవి సరియైనవని భావించిన ాఆదిశంకరులు విక్రమ శకం 14లో ఈశ్వరనామసంవత్సర వైశాఖ శుద్ధ పంచమితిథి వర్తమాన
గణననుసరించి క్రీ.పూ.44 మార్చి 25 నాడని తెలుస్తోంది?

మఠంవారి గురపరంపర పట్టికను అనుసరించి ఆదిశంకరులు ఖచ్చితంగా క్రీస్తు పూర్వమే జన్మించినట్లు, పాశ్చాత్య చరిత్రకారులచే చెప్పబడ్డ ఏడవ శతాబ్దం లేదా ఎనిమిదవ శతాబ్దములో అవతరించిన శంకరులు ఆదిశంకరులు కాక ఆచార్య పరంపరలోని 36వ ఆచార్యలైన విశేష జ్ఞానవంతులైన అభినవ శంకరులను ఆదిశంకరులుగా భావించడం జరిగిందని చెప్పవచును. అభినవ శంకరులు క్రీశ788లో విభవనామ వృషభమాసంలో శుక్లపక్షదశమినాడు అవతరించినట్లు రికార్డులు తెలియచేస్తున్నాయి.

Adishankaracharya's birth anniversary

మార్చి 44బి.సి.,సుమారు మధ్యాహ్నసమయము 08"ఉ29, 76° తూ59.

విశేష అంశాలు -

లగ్నాధిపతి చంద్రుడు మేధోగ్రహమైన బుధుని రాశిలో ఉండగా ఇదే సమయంలో బుధుడు దశమస్థానంలో ఉండడం శంకరుల అత్యద్భుత మైన మేధస్సుకు, సునిశితమైన జ్ఞానమునకు, సమున్నతమైన శీలమునకు కారణమై నట్లు చెప్పవచ్చును. బుధుడు రవితో కలసినను అస్తంగత్వం పొందని కారణంగా అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉండడం జరిగింది. చంద్రునిపై గురుని దృష్టి అపారమైన ఆధ్యాత్మికతకు కారణమైతే, కుజుని వీక్షణ ప్రగాఢమైన భావోద్వేగాలకు కారణమై ఆదిశంకరుల ఉన్నతికి ఆకర్షణకు కారణమైనట్లు చెప్పవచ్చును.

వాక్స్థానాధిపతియైన రవి దశమంలో తన ఉచ్చస్థానమందు తార్మిక సంబంధ గ్రహమైన బుధునితో మరియు కవితా ప్రాధిని సూచించే శుక్రునితో కలవడం జరిగింది. వాక్ స్థానంపై ఆధ్యాత్మిక సంబంధ గ్రహమైన గురుని దృష్టి శంకరులను తర్క నిపుణుని చేసినవి. మధురమైన మాటలతో అపూర్వమైన వాదనా పటిమతో వేలాదిమందిని ఓడించి తన శిష్యులుగా మార్చుకున్న మేధావిని చేసింది.

విద్యా స్థానాధిపతి శుక్రుడు దశమంలో ఉండి విద్యాస్థానమును వీక్షించడం,ఈ శుక్రునితో పాటు రవి, బుధ, గురులచే విద్యా స్థానము వీక్షించబడడం గమనించదగిన విషయము. ఆత్మకారకునిగా రవి, విద్యా కారకునిగా బుధుడు, జ్ఞానకారకుడైన గురుడు, కావ్యకారకుడైన శుక్రుల దృష్టి చతుర్థ స్థానంపై పడడం విశేషమైన యోగముగా చెప్పవచ్చును. అంతే కాక కుజుని విశేష దృష్టి అనుభవంలో ఆచరణను సూచించినట్టు చెప్పవచ్చును.

ఇదే ఆదిశంకరుని అసాధారణ మేధావిని సకలశిక్షా పారంగతుని చేసినట్లు చెప్పవచ్చును. ఆదిశంకరుల రచనలను పరిశీలిస్తే ఆయన ఎంతగొప్ప తాత్వికుడో అంత గొప్ప కవో ప్రతి పదంలోను బయటపడుతుంది. తత్వచింతనను అంగీకరించలేనివారు సైతం వారి కవితా శక్తిని చూసి ముగ్గులు కాక తప్పదు. అష్టమాధిపతిగా శని శుక్రుని నక్షత్రములో ఉండడం, ఈ శుక్రుడు ద్వితీయాధి పతి మారకుడైన రవితో కలవడం అల్పాయర్గాయాన్ని సూచిస్తున్నాయి. ఇక నవాంశలో అష్టమస్థానంలో కేతువుతో కలసిన శుక్రునిస్థితి కారణంగా పాపత్వం పొందడం దీనికి బలంగా లగ్నాధిపతి వ్యయస్థానంలో ఉండడం ఆయుర్గాయానికి మంచిది కాదని చెప్పవచ్చును.

భాగ్యాధిపతిగా(పితృస్థానాధిపతి) గురుడు భాగ్యానికి వ్యయస్థానమైన అష్టమంలో ఉండడం, పాపప్రమైన కుజుడు పితృస్థానస్థితి, నైసర్గిక పితృకారకుడైన రవి పాపకర్తరీయోగములో కేతునక్షత్రములో ఉండడం-ఇవన్నీ శంకరుల చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోవడానికి కారణములని చెప్పవచ్చును. లగ్నాధిపతి చంద్రుడు మాతృకారకునిగా శుభస్థానములో ఉండడం, చతుర్గాధిపతి'

దశము కేంద్రస్థితి శంకరులకు తల్లితోగల అనుబంధాన్ని సూచిస్తోంది. సన్యాసులకు కర్మాధికారం లేక పోయినా శంకరులు తల్లికి ఇచ్చిన మాటప్రకారం సంప్రదాయాన్ని ధిక్కరించి బంధువులు వారిస్తున్నా లెక్కచేయక తన చేతులమీదుగా అగ్నిసంస్కారాన్ని చేసాడు. సప్తమాధిపతి శని షష్ట(వ్యయం నుండి సప్తమం)స్థితి,
కళత్రకారకుడైన శుక్రుడు కేతునక్షత్రస్థితి పాపత్వం పొందడమే కాకుండా పాపకర్తరీయోగములో
ఉండడం గమనించవచ్చును. గురుని అష్టమస్థితి, శుక్రుడు మోక్షకారకుడైన కేతునక్షత్రంలో ఉండడం వీరి శారీరక మానసికశుద్ధికి, మచ్చలేని వ్యక్తిత్వానికి బలమైన కారణమైనట్లు తెలుసు కోవచ్చును. ఈ జాతకంలో షష్ణస్థానము ప్రత్యేకంగా గమనించవలసి ఉంది.

షష్టస్థానము అనుసరించి శత్రు, రోగ, బుణాదులను విచారణ చేస్తాము. 7,8 లకు అధిపతిగా శని షష్ణస్థితి, షష్ణాధిపతి గురుడు అష్టమస్థానస్థితి ఏర్పడడం, షష్ణాష్టమాధిపతుల పరివర్తన ఏర్పడి మోక్షస్థానంలో ఉన్న లగ్నాధిపతి చంద్రుని వీక్షించడం జరిగింది.

లగ్నాధిపతియైన చంద్రుడు ప్రధానంగా మనస్సుకు కారకుడు అవ్వడం, పై పాప గ్రహస్థితి వాదించడానికి అసాధ్యంగా ఉన్న బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, సౌరం, శాక్లేయం, పాంచరాత్రం, కాపాలికం వంటి వివిధమతాలను, నరబలులు, జంతు బలులు వంటి క్రూరాచారాలను ఖండిసూ, బలమైన ప్రత్యర్తులు, శత్రువు లతో వాదప్రతివాదనలు చేస్తూ వారిని ఓడిస్తూ స్వమతాన్ని ప్రతిష్టిస్తూ, ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాస్తూ అద్వైత మత్రాన్ని స్థాపించారు.

ఆత్మకారకుడైన శని మేధోగ్రహమైన బుధునితో (మోక్షకారక స్థానాధిపతియై తిరిగి గురునిచే చూడబడడం) కలయిక శంకరుల సిద్దాంతము అద్వైతమనే విషయాన్ని బలపరుస్తోంది. బ్రహ్మ ఒకటే సత్యమని, జగత్తు అంతా మిధ్యని, ఈ జీవుడే ఆ బ్రహ్మం, ఈ రెండు వేరుకాదనేది అద్వైత సారాంశము. శంకరుల జాతకంలో గమనించదగిన మరొక ముఖ్య విషయము అంశ కుండలిలో చంద్రాత్తు 12పై నాలుగు గ్రహముల దృష్టి ఏర్పడడం.

English summary
Astrologer explains the details of Adishankaracharya on the occasion of his birth Anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X