15వ తేదీ నుంచి ఈ రాశులవారు జమిందారులే
నవంబరు 15వ తేదీన శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఎందుకంటే దీపావళి తర్వాత శనిదేవుడి గమనంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి బాగా కలిసివస్తుంది. వచ్చే ఏడాది శనిదేవుడు కుంభ రాశి నుంచి బయటకు వస్తాడు. దీనికి ముందే నక్షత్ర సంచారం చేస్తాడు. దీనివల్ల కూడా కొన్ని రాశులవారికి శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. దీనివల్ల జీవితంలో ఇంతవరకు ఎన్నడూ పొందలేని సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి.
కర్కాటక రాశి
పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉద్యోగాలు చేసేవారికి వారు పనిచేసేచోట బాగా కలిసిరావడంతోపాటు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించి వేతనం పెరుగుతుంది. పనితీరుపై మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు వారి శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ఎప్పటినుంచో అనుకుంటున్నవారు ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతారు.

మీన రాశి
ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రేమ జీవితంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇరువైపుల పెద్దల నుంచి శుభవార్తలను వింటారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్నచోటకు బదిలీ అయ్యే అవకాశం ఉందికానీ అందుకు కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు.
మకర రాశి
నవంబరు 15వ తేదీ నుంచి ఈ రాశివారికి చాలా బాగుంటుంది. అందరిపట్ల వీరు ఎంతో ప్రేమతో వ్యవహరిస్తారు. ఎటువంటి సమస్యలనైనా సులువుగా పరిష్కరింపచేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications