మాఘ పూర్ణిమ నాడు ద్వాదశరాశుల వారు ఈ దానాలు చేస్తే ధనలక్ష్మీ కటాక్షం!
హిందూమత సంప్రదాయం ప్రకారం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈసారి ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి రాబోతుంది. మాఘ పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలితం వస్తుందని చెబుతారు. అంతేకాదు దానాలు చేయడం వల్ల కూడా రెట్టింపు ఫలితాలను పొందవచ్చని చెబుతారు.
మాఘ పౌర్ణమి నాడు దానాలు
దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని, అదృష్టం వెన్నంటే ఉంటుందని చెబుతారు. ఇక ద్వాదశ రాశుల వారు మాఘ పూర్ణిమనాడు చేసే కొన్ని దానాలు ధరలక్ష్మీ కటాక్షానికి కారణం అవుతాయని చెబుతున్నారు. మరి ఆ దానాలు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారు మాఘ పౌర్ణమి నాడు పప్పులు, బెల్లం, రాగి వస్తువులు, ఎర్రటి దుస్తులు, గోధుమలు, దానిమ్మ పండ్లు, రాగులు దానం చేస్తే మంచిది. ఇలా చేస్తే మేషరాశి జాతకులు వారు చేసే పనులలో సక్సెస్ అందుకుంటారు.
వృషభరాశి
వృషభ రాశి జాతకులు పిండి, ఉప్పు, సువాసన వచ్చే వస్తువులు, బియ్యం, పెరుగు వంటి వాటిని దానం చేయాలి. వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు పెసరపప్పు, ఆకుకూరలు, పుస్తకాలు, ధనియాలు వంటి వాటిని దానం చేయాలి. ఇవి దానం చేయటం వారి సక్సెస్ కు కారణం అవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు తెల్లని దుస్తులు, పంచదార, కొబ్బరికాయ, పాలు, వెండి, బియ్యం వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతతతో సంతోషంగా జీవిస్తారు.
సింహరాశి
సింహ రాశి వారు యాపిల్ పండ్లు, ఎర్రటి దుస్తులు, గోధుమలు, బెల్లం, రాగి వస్తువులు, వేరుశనగ వంటి వాటిని దానం చేయాలి. ఇవి దానం చేస్తే సింహరాశి వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పనిలో సక్సెస్ అందుకుంటారు.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులు ఆకుపచ్చ దుస్తులు, చెరకు రసం, పెసలు, పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది.
తులారాశి
తులారాశి వారు మాఘ పౌర్ణమి నాడు తెల్లని దుస్తులు, తెల్లని వస్తువులు, బియ్యం, పెరుగు, పంచదార వంటివి దానం చేయాలి..ఇలా దానం చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు బెల్లం, కొబ్బరికాయ, పప్పులు, రాగి వస్తువులు, తేనె, ఎండుమిర్చి వంటివి దానం చేయాలి. దీంతో వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారు మాఘ పౌర్ణమి నాడు పసుపు రంగులో ఉండే పప్పులు, పసుపు దుస్తులు, అరటి పండ్లు, పసుపు, వంటివి దానం చేయాలి. వీటి వల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.
మకర రాశి
మకర రాశి వారు మాఘ పౌర్ణమి నాడు నల్ల నువ్వులు, మినపపప్పు, ఆవాల నూనె, ఆవాలు, దుప్పట్లు దానం చేయాలి. దీనివల్ల వీరికి శని దోషం తొలగిపోతుంది.
కుంభరాశి
కుంభ రాశి వారు మాఘ పౌర్ణమి నాడు ఇనుప వస్తువులు, గొడుగు, నల్ల నువ్వులు, నీలి రంగు దుస్తులు వంటివి దానం చేయాలి. దీనివల్ల వీరు సక్సెస్ ను అందుకుంటారు. ప్రశాంతత కూడా లభిస్తుంది.
మీనరాశి
మీన రాశి వారు పసుపు రంగు దుస్తులు, కుంకుమపువ్వు, పువ్వులు వంటి వాటిని దానం చేయాలి. దీనివల్ల మీనరాశి వారు సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications