ఈరాశివారికి ధనలాభంతోపాటు ఆస్తులు వృద్ధి చెందుతాయి!
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజు నుంచి గ్రహాలు అనుకూలంగా మారి సిరిసంపదలనిస్తాయని, భోగభాగ్యాలనిస్తాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నమ్ముతారు. ఈ ఏడాది ధనుస్సు రాశివారికి ఎలా ఉందో పరిశీలిద్దాం
కుంభ రాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంది. వీరికి ఈ ఏడాది అదృష్టయోగం 50 శాతం బాగుంది. పనులు వాయిదా వేస్తే లక్ష్యాన్ని చేరుకోలేరు. అద్భుతమైన ధనలాభాలతోపాటు ఆస్తులన్నీ వృద్ధి చెందుతాయి. ఏప్రిల్ వరకు ఉద్యోగంలో ఎదగడానికి సమయం ఉంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో శుభాలను కలిగిస్తాయి.
వ్యాపారంలో మంచి ఫలితాలు లభించడంతోపాటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ద్వితీయంలో ఉన్న గురువు బ్రహ్మాండమైన శుభాలను కలిగిస్తాడు. జన్మ రాశిలో ఏలిన నాటి శని ప్రభావం చూపుతుంది. తృతీయ స్థానంలో ఉన్న రాహువు అక్టోబరు 31వ తేదీ వరకు కార్యసిద్ధినిస్తాడు. నవంబరు నుంచి ద్వితీయంలో ఉండంవల్ల ఆర్థిక నష్టాలతోపాటు కుటుంబ కలహాలుంటాయి. నివారణకు రాహువు శ్లోకం చదువుకోవాలి.

మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2 గా ఉంది. భూమి, వాహనాలకు సంబంధించి యోగాలను పొందే క్రమంలో రుణసమస్యలు తలెత్తుతాయి.. అవి రానివ్వకుండా చూసుకోవాలి. అదృష్టయోగం 25 శాతం ఉంది. విద్యార్థులకు గురుబలం వల్ల విజయాలు లభిస్తాయి. ఏప్రిల్ నుంచి ఉద్యోగస్తులకు కలిసివస్తుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో విదేశీ ప్రయత్నాలు చేస్తున్నవారి పనులు అవుతాయి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏప్రిల్ 23 నుంచి గురువు ధనస్థానంలో ఉంటాడు. దీనివల్ల విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. శని ద్వాదశ స్థానంలో ఉండటంతో ఈ ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. రాహువు అక్టోబరు 31వ తేదీ వరకు ద్వితీయంలో ఆ తర్వాత జన్మరాశిలో ఉండి శ్రమను కలిగిస్తాడు. అష్టమ, సప్తమ స్థానాల్లో ఉన్న కేతువు ఇబ్బందులకు గురిచేస్తాడు.
నోట్: ఇతర రాశుల ఫలితాలు కావల్సినవారు ఈ క్రింది లింకుల్లో చూడగలరు.












Click it and Unblock the Notifications