స్కూల్ వ్యాన్ ను ఢీ కొట్టిన రైలు: ముక్కలు.. పట్టాలపై చెల్లాచెదురు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. , పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. వారి కుటుంబ సభ్యుల్లో శోకాన్ని మిగిలించింది.

ముర్షిదాబాద్ పరిధిలోని బెర్హంపూర్ సమీపంలో గల కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఉదయం 7 గంటల సమయంలో ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను పాఠశాలకు చేర్చే క్రమంలో ఈ పూల్ కార్ క్రాసింగ్ దాటుతుండగా.. కట్వా నుంచి ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. రైలు వేగానికి స్కూల్ పూల్ కార్ ముక్కలు ముక్కలైంది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ పూర్తిగా ధ్వంసమై పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయింది.

School Van Hit by Train at level crossing in Murshidabad West Bengal as 3 Dead Several Students Injured

ఈ ప్రమాదం జరిగిన తీరుపై ప్రత్యక్ష సాక్షులు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ఓ ట్రాక్‌పై అప్ లైన్ రైలు వెళ్లిన తర్వాత రైల్వే గేట్‌మన్ గేట్‌ను తెరిచాడని, మరో ట్రాక్ పై వేగంగా దూసుకువస్తున్న రైలును గమనించకుండా గేటును అలాగే ఉంచేశాడని చెప్పారు. ఫలితంగా స్కూల్ వ్యాన్ పట్టాలపైకి రావడం, కాట్వా ప్యాసింజర్ రైలు దీన్ని వేగంగా ఢీ కొనడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గేట్‌మన్ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో చిన్నారి క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. వాహనం పూర్తిగా ధ్వంసమైంది. కొన్ని మీటర్ల దూరం పట్టాలపై పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసి ప్రాణాలు కాపాడేందుకు గ్రామస్థులు ఎంతో శ్రమించారు.

బంగారం ధరలు కుదేల్.. అభద్రతాభావం: దెబ్బతింటోన్న సెంటిమెంట్
బంగారం ధరలు కుదేల్.. అభద్రతాభావం: దెబ్బతింటోన్న సెంటిమెంట్

తీవ్రంగా గాయపడిన పలువురు విద్యార్థులను స్థానికులు, రెస్క్యూ సిబ్బంది ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడ్డ వారికి స్పెషలిస్ట్ డాక్టర్లు చికిత్సలు అందిస్తున్నారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఆందోళనతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం భారీ సంఖ్యలో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం- నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు

ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. రైల్వే గేట్‌మన్ విధి నిర్వహణలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యంపై ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గేట్‌మన్ ప్రవర్తనను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

రైల్వే క్రాసింగ్‌ల వద్ద తరచూ ఇటువంటి నిర్లక్ష్యపు ప్రమాదాలు జరగడం ప్రయాణికులు ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ప్రమాదానికి కారకులైన వారిపై వేగంగా పరిశోధన జరిపి, తగిన న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+