తంత్ర అంటే ఏమిటి?: దాని ఆవశ్యకత..

Subscribe to Oneindia Telugu

మంత్రసిద్దిపొంది, యంత్రాన్ని అధిదేవతను నిర్దిష్ట పూజా ద్రవ్యాలతో, ముద్రలతో పూజించే విధానాన్ని తంత్రమంటారు. సత్ఫలితాల్ని పొందడానికి సిద్ది పొందిన గురువు అవసరం. ఆధునిక కాలంలో పొందే అనేకానేక అవరోధాలు దాటడానికి తంత్రశాస్త్రమెంతో ఉపకరిస్తుంది. ఇతరులను బాధించేవిధంగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిదికాదు. ఇతరులు పెట్టే బాధలనుండి విముక్తి పొందడానికుపయోగింపవచ్చును.

పగతీర్చుకోవడంకన్నా పగలేకుండా, రాకుండా చేసుకోవడానికి తంత్రాన్ని సద్వినియోగపర్చుట మంచిది. లేకపోతే ప్రకృతి మనపై పగతీర్చుకొంటుంది. తంత్రంలో పూజాద్రవ్యాలు అత్యంత కీలకపాత్ర వహిస్తాయి. ఫలం, పత్రం, పుష్పం, తోయం, ఓషధులు, ధూపం, దీపం రంగులు, అక్షతలు, జపమాల, ఆసనం మొదలగు పూజాద్రవ్యాలు శుచిగ, శుభ్రంగా, భద్రంగా ఉంచాలి.

astrologer explains what is tantra?

అంతేకాకుండా వివిధ సాధనలకు నిర్దేశింపబడిన పూజాద్రవ్యాలనే వాడాలి తప్ప లభ్యం కాలేదని మన ఇష్టమొచ్చిన ద్రవ్యాలను ఉపయోగించరాదు. ఆ విధంగా చేయుటవల్ల సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు రావచ్చును. దానివల్ల శాస్త్రం పట్ల అపోహ, విముఖత కల్లవచ్చును.

తంత్రశాస్త్ర ఆవశ్యకత ఎంత?

తంత్రమంటే శాస్త్రం కాదు. ఆచరణ విధానం. ఏయే కర్మలు ఏ విధంగా చెయ్యాలో నిర్దేశిస్తుంది తప్ప బోధన చెయ్యదు. ఆధునిక కాలంలోని అప్లైడు సైన్సువంటిది. ప్రయోగం చేయుటవల్లనే ఫలితం అర్థమౌతుంది తప్ప పఠనంవల్ల, వినడంవల్ల తంత్రము తెలియబడదు. ప్రతిమతమందు తంత్రవిధానముంటుంది. తంత్రవిధానం లేని మతమే ఉండదు.

విధానంలో తేడాతప్ప తంత్రం లేకుండా ప్రపంచంలో ఏ మతకార్యముకాని, దైవిక కార్యకలాపంకాని ఉండదు. అసలీ తంత్రశాస్త్రమును శివుడు కైలాస పర్వతమునందు పార్వతికి ఉపదేశించినట్ల చెప్పబడింది. చెప్పిన ప్రతిచోట అతిరహస్యమైనదని, గోప్యమైనదని చెప్పబడుటవల్ల అనాదిగ గోప్యంగా ఉంచబడుటవల్ల ప్రజల్లో అనేకానేక భయాలు, సందేహాలు చోటు చేసుకున్నాయి.
తంత్రానికి మతంతో సంబంధముండదు. ఎవరే మతం పుచ్చుకొన్నా తంత్రము సాధనతో కూడుకొన్నది.

తంత్రాన్ని అర్థంచేసుకొనుటకు ప్రయత్నించడమన్నది అర్థంలేని వ్యర్థ ప్రయాస, తంత్రాన్ని సాధన చెయ్యాలి.
జాతి, వర్ణ ప్రాంత, మత సంబంధాల కతీతమైనది మంత్రశాస్త్రము. సాధన ఒక్కటే దాని పరమగమ్యం తప్ప మరేదీ కాదు. తంత్రం ద్వారా ప్రాకృతిక శక్తులను మనకనుగుణంగా మార్చుకొనుటవల్ల, మనకు కావలసిన పనులు చేసుకోవచ్చును. ప్రకృతి ప్రసాదించిన నీటిని ఏ విధంగా త్రాగుటకు, కరెంటు తయారుచేయుటకు, వ్యవసాయానికి, అభిషేకానికి వాడుకొంటామో ఆ విధంగానే తంత్రాన్ని వాడుకోవాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains about Tantra and its importance in human life. He said Tantra is like applied science in modern human life
Please Wait while comments are loading...