Google AI: ఏఐ ఖర్చులు తగ్గించుకోండిలా..! కంపెనీలకు గూగుల్ భారీ ఆఫర్..!

కృత్రిమ మేధ (AI) కంపెనీలు మరింత శక్తివంతమైన మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి పోటీపడుతున్నా, గూగుల్ (Google) తక్కువ ఖర్చుతో అదే పని చేయాలని భావిస్తోంది. అత్యంత అధునాతన, ఖరీదైన ఏఐ సిస్టమ్‌లపై పూర్తిగా ఆధారపడకుండా, తమ తాజా జెమిని 3.5 ఫ్లాష్ మోడల్‌ను ఉపయోగించడం ద్వారా వ్యాపారాలు గణనీయమైన మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. తమ జెమిని 3.5 ఫ్లాష్‌ను అత్యాధునిక ఏఐ మోడల్స్‌కు చౌకైన ప్రత్యామ్నాయంగా నిలబెడుతోంది. అయినా బలమైన పనితీరును అందిస్తోంది.

కంపెనీలు మే నెలలోనే తమ వార్షిక టోకెన్ బడ్జెట్లను ఖర్చు చేస్తున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గూగుల్ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. కంపెనీలు తమ జెమినీ ఫ్లాష్ తో పాటు , ఇతర అత్యాధునిక మోడల్స్‌ను కలిపి ఉపయోగిస్తే, చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ప్రధాన గూగుల్ క్లౌడ్ కస్టమర్‌లు తమ ఏఐ పనుల్లో 80% జెమిని 3.5 ఫ్లాష్, ఇతర మోడల్స్‌కు మార్చితే, ఏటా $1 బిలియన్లకు పైగా ఆదా చేసుకోవచ్చని ఆయన వివరించారు.

Google AI Advantage 2026 How 20 Years of Infrastructure Investment Puts It Ahead in the AI Spending Race

ఏఐ వినియోగం పెరిగే కొద్దీ వ్యాపారాలు ఈ విభాగంలో ఖర్చులపై ఫోకస్ పెంచుతున్న నేపథ్యంలో దీనికి సరైన ప్రత్యామ్నాయం ఇదేనని సుందర్ పిచాయ్ చెప్తున్నారు. గూగుల్ తన ఏఐ మౌలిక సదుపాయాలను చిప్‌లు, డేటా సెంటర్‌లు, క్లౌడ్ సేవలు, ఏఐ మోడల్స్‌తో సహా చాలావరకు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల దీనికి గణనీయమైన ప్రయోజనం లభిస్తుంది. ఈ పరిస్థితిని బిజినెస్ ఇన్‌సైడర్ ఇంటర్నెట్ శోధనలో గూగుల్ విజృంభణతో పోల్చింది. అక్కడ వేగం, స్థాయి, తక్కువ ఖర్చు ప్రత్యర్థుల కంటే కంపెనీ గొప్పగా రాణించడానికి సాయపడ్డాయి. కేవలం అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్స్‌ను నిర్మించడంలో మాత్రమే పోటీపడకుండా, భారీ బిల్లులు లేకుండా ఉపయోగకరమైన ఫలితాలను అందించే ఏఐని వ్యాపారాలు కోరుకుంటున్నాయని గూగుల్ సవాల్ విసురుతోంది. దీంతో కంపెనీలకు ఖర్చులూ తగ్గబోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+