ఆశ్రేష, మూలా నక్షత్రాల వారితో అత్తమామలకు హాని తప్పదా?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆశ్రేష నక్షత్రంలో జన్మించినవారు అత్తగారికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు బావగారికి, జ్యేష్ణా నక్షత్రంలో జన్మించినవారు సోదరులకు, మూలా, మరియు మఘ నక్షత్రాలలో జన్మించినవారు మామగారికి ప్రాణహాని కలిగించ గలరని జనసామాన్యంలో బహుళ ప్రచారంలో ఉన్న అంశం.

అయితే ఈ అంశానికి జ్యోతిశాస్త్ర ధర్మాల్ని అన్వయించి పరిశీలించినట్లయితే చాలా వరకు అపోహలుగా రుజువవుతున్నాయి. ఎందుకంటే నక్షత్ర దోషం గురించి తెలిపిన ఋషులే దోష అపవాదములను గురించి కూడా తెలియజేశారన్న విషయాన్ని శ్రద్దగా గమనించినట్లయితే ఈ నక్షత్రదోషాలకు సంబంధించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అందుకే ఫలిత నిర్ధారణలో కొన్ని శాస్త్రపరమైన ధర్మాలను మెళుకువతో పరిశీలించాలని బుషి వచనం.

astrologer tells about Ashresha, moola nakshatra

ఈ విశేషాన్ని గమనించకుండా కేవలం ప్రాధ మికంగా తెలియజేసిన సాధారణ నక్షత్రదోష విషయాలను యధాతధంగా అన్వయించడం సమ్మతం కాదు.
పీఠిక విూద కనిపించే ఎన్నో (అవ)యోగాలు అనుభవానికి రాకుండా ఏర్పడుతుంది. అటువంటప్పడు వాటిని ప్రస్తావించడం.. జ్యోతిశ్శాస్త్రమనేది ఒక జటిలమైన శాస్త్రం. పరిశీలనాంశాలకు కావలసిన విషయాలెన్నోఉన్నాయి. వాటిని సమన్వయం చేసుకుంటూ యోగాలనూ, అవయోగాలనూ, యోగభంగాలనూ బేరీజు వేసుకుంటూ ఫలితాన్ని నిర్ధారించాలి. అందువలన "దోషం" అనేవారికి "దోష అపవాదమూ" తెలిసి ఉండాలి.

అంతేగాని కారణమే తెలియని అర్థం లేని "వాడుక మాటలవలె" ప్రాధమిక నక్షత్ర దోషాన్ని యధాతధంగా ఆపాదించకూడదు. వివాహ నిశ్చయ సమయంలో వధూవరుల జాతకాలను పరిశీలించేటప్పుడు వారివారి జాతకాలలో ఒకరికొకరు పంచమం, సప్తమం, సప్తమాధిపతి స్థితి, ఆయుర్భాగ్యం, ఆరోగ్యవిషయాలు సౌభాగ్య, సంతతి, స్వస్టసంతతి, యోగాలు పరిశీలించాలి.

కుటుంబ విషయంగా నవమం, దశమం, తృతీయం కూడా విచారిం చబడతాయి. ప్రేష్యరేఖా యోగాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఈ విధంగా వధూ వరుల జాతకమేళన విచారణలో జాతకంలో గ్రహస్థితికి ప్రాధాన్యత తెలియజేశారే తప్ప, ఏ నక్షత్రం గురించి ప్రస్తావనగానీ, నక్షత్ర ప్రమేయంగానీ "లేనేలేదన్న" విషయం గమనార్హం. కనుక వివాహ విషయంగా జాతక విచారణ చేయునపుడు కేవలం నక్షత్ర మును మాత్రమే ఆధారంగా చేసుకొని దోషం నిర్ణయించుట ప్రస్తావించుట శా సమ్మతం కాదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about Ashresha, moola nakshatra.
Please Wait while comments are loading...