వాస్తు ప్రకారం పడక గది నియమాలు, జాగ్రత్తలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: దక్షిణ, పడమరల మధ్య వీధులు కలిగియున్న స్థలమును నైరుతి బ్లాకని అంటారు. వాస్తుకి తగినట్టుగా ఉన్న నైరుతి బ్లాకు గొప్పదిగా నుండును. 

ఈదిక్కు విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు. అందువలన ప్లాటులోగాని, బ్లాకులోగాని, ఇంటిలోగాని, గదిలోగాని, నైరుతి విషయంలో జాగ్రత్తగా యుండవలెను. ఈ యింటికి వంట ఏర్పాటు ఆగ్నేయపు గదిలోగాని, వాయువ్యపు గదిలోగాని ఏర్పాటు చేసుకొనవచ్చును.

ఇంటికి నైరుతిదిక్కున గోతులుగాని, నూతులుగాని ఉండరాదు.
నైరుతి ఎత్తును ఎంత పెంచినా దోషము లేదు. ముఖ్య మైన గదిగాని, ఉపగృహంగాని మూలమట్టమునకు యుండవలెను. నైరుతి బ్లాకు స్థలాలకు మెయిన్ డోర్ ఏదో ఒక వైపు రోడుకు తిరిగి ఉండాలి. ఇంటికి, ఇంటి ఆవరణకి దక్షిణ, పశ్చిమ నైరుతిలో తలుపులుంటే కష్టాల పాలవుతారు లేకపొతే అనారోగ్యముతో జీవితాలు గడుస్తాయి. ఇల్లు ఉత్తరము హద్దుచేసి దక్షిణ నైరుతిలో ద్వారాలు ఉంటే అందులోని స్త్రీలు సుఖములేక బాధపడుచుందురు. నైరుతి పల్లంగా మరియు చెరువులుగాని, గుంటలుగాని యున్న స్థలములు కొనరాదు.

astrologer tells about bedroom vastu

వీదిపోటుల్లో రకాలు, వాటివాటి ఫలితాలు
వాస్తు పరంగా వీధి పోట్లలో మంచివి, చెడ్డవి అని రెండు రకాల వీధి పోటులు ఉన్నాయి.
అంటే ఈ వీధిలో నడిచే వారు ఆ భవనాన్ని పొడిచినట్టుగా నడుస్తారు అనే భావాన్ని స్ఫురింపజేస్తుంది.
ఒక ఇంటి ముందుగల వీధి ఇంటిని దాటిన వెంటనే వీధి వంపు తిరిగి తిన్నగా పెరిగితే వంపు వద్దగల ఇల్లు వీధి పోటుగల ఇల్లు అవుతుంది..ఈశాన్యము వీధిపోటు అనగా- ఈశాన్య వీధివీధిపోటు కలిగితే అది ఈశాన్య వీధి పోటూ అంటారు.

ఈ వీధి పోటు వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రమాదమేమీ ఉండదు.ఆగ్నేయ విధి పోటు దీనివల్ల కూడా ఇంట్లో ఉండే వాళ్లకి ఐశ్వర్యము వృద్ధి చెందుతుంది. పడమర వీధి పోటు అయితే ఇది కొంత మంచి కొంత చెడు ఫలితాలను ఇస్తుంది ప్రమాదకరమైన సందర్భం ఉండవు.

దక్షిణ నైరుతి వీధి పోటు - ఇదిచాలా నీచమైనది. దీనివలన ఇంటికి కొంత అసౌకర్యం ఆడపిల్లల సంతతి వృద్ధి చెందడం జరుగుతుంది. అనారోగ్యం కూడా పెరుగుతుంది.
పడమర వీధి పోటు ఇదికూడా మంచివి కాదు. కుటుంబంలోని మగవారు ఆరోగ్యాన్ని దెబ్బ తీసే శక్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

వాయవ్యపు వీధి పోటు కూడా చెడు ఫలితములనిచ్చును. దీని ప్రభావము వలన ఆ ఇంటిలోని వారు మానసిక శాంతి లేక ఆర్థిక బాధలలో అల్లాడుచుందురు.కొన్ని శాస్త్రములలో వ్యాపార గృహము లేదా దుకాణములకు వీధిపోటు లాభదాయకమని చెప్పబడింది.

దుకాణాల కోసం వాస్తు సూచనలు
వాస్తు శాస్త్రము దుకాణముల కోసం కౌంటర్ ఎక్కడ ఉండాలో ఎటువైపు యజమాని కూర్చోవాలో ఎటువైపు మెయిన్ డోర్ ఉండాలో ఎటు వైపు ఉండకూడదు మొదలైన అనేక విషయాలను చెప్పారు.
దుకాణాలు చతురస్రంగా లేక దీర్ఘచతురస్రాకారముగా నుండవలెను.
దుకాణమునకు ఈశాన్యమయినా సరే లేదా తూర్పు ఈశాన్యముగానైన పెరిగి యుండుట మంచిది.

ఉత్తరానికి గానీ ఈశాన్యానికి కానీ డ్రైనేజీ కడిగిన నీళ్లు మొదలైనవి వెళ్ళిపోయే మార్గాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. దుకాణాల్లో బరువు ఉండే వస్తువులు దక్షిణము లేదన్న నైరుతి మూలన ఉంటే మంచిది. కౌంటర్ మొదలైన కదలని వస్తువులను నైరుతిన ఉంచి తూర్పు వైపు లేదా ఉత్తరం వైపు తిరిగిఉండేలాగా ఏర్పాటు చేయాలి.పూజా మందిరం వీలైనంతవరకు ఈశాన్యము మరియు తూర్పు లేదా కౌంటర్ పక్కన ఏర్పాటు చేసుకోవడం మంచిది.

పడమర వైపు ముఖద్వారం ఉండే దుకాణాలలో యజమాని నైరుతి దిక్కున కూర్చుండవలెను. ఉత్తరం వైపు ముఖద్వారం ఉండే వ్యాపార సంస్థలలో యజమాని నైరుతిలో లేదా వాయువ్యములో కూర్చునుట లాభదాయకము.

దుకాణాలలో ఈశాన్య భాగంలో చెత్తబుట్ట చీపురు చెప్పుల స్టాండు పాత వస్తువులు బరువు మొదలైన వస్తువులని ఉంచరాదు. దేవుడి పటాలు లక్ష్మీదేవి పటాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కేవలంపూజా మందిరం దగ్గర మాత్రమే ఉంచాలి. ప్రతి అమావాస్యకు ఒకసారి గుమ్మడి కాయ దిష్టి తీసి కొట్టాలి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about bedroom vastu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి