మన ఆరోగ్యాన్నికాపాడుకోవాలంటే ఏ స్తోత్రాలు చదవాలి?
గాలి ఎక్కువగా పీల్చుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, మితంగా సాత్విక ఆహారం తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం - ఇవి మన ఆరోగ్య సౌధానికి నాలుగు ప్రధాన స్తంభాలు.
హైదరాబాద్: గాలి ఎక్కువగా పీల్చుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, మితంగా సాత్విక ఆహారం తీసుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం - ఇవి మన ఆరోగ్య సౌధానికి నాలుగు ప్రధాన స్తంభాలు. ఆపైన ఈ క్రింది స్తోత్రాలు అనుసంధిస్తే, భగవదనుగ్రహంవల్ల పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది.
1) ప్రతిరోజు ఉదయించే సూర్యుని ముందు నిల్చొని, 'ఆదిత్య హృదయం" చదవాలి. శాస్త్ర పద్ధతిలో సూర్య నమస్కారాలు కూడా చేస్తే మంచిది.
2) వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని 59వ సర్గ పారాయణం చెయ్యాలి. ఇది మనలోని అహంకారాన్ని అంతః శత్రువులను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది.
3) జాతకాలు చూసి, జ్యోతిష్కులు చెప్పిన మహాదశ, అంతర్దశలలోని గ్రహదోషాలను నివారించడానికి, వాయు పురాణంలోని 'ఉమా సంహిత'లో సూచించిన విధంగా ఆయా ఘట్టాలు పారాయణం చెయ్యాలి.
4) నవగ్రహాలకు అధిపతి శ్రీ సుదర్శనులవారు. భగవంతుని సంకల్పానుసారం వారు నడుస్తారు. మన కర్మ ఫలాలను, ప్రధానంగా అనారోగ్యములను నియంత్రించే ఆదేశాలను భగవంతుడు నరసింహ దివ్యరూపంలో సుదర్శనుల వారికి కటాక్షిస్తాడని ప్రసిద్ధి. అందువల్ల వారికి ప్రీతి కలిగించే సుదర్శన శతకం, సుదర్శనాష్టకం, నృసింహాష్టకం, లక్ష్మీనరసింహ అష్ణోత్తర శతనామావళి పారాయణం అర్చన చేయడం మంచిది.
5) అనారోగ్యాన్ని దూరం చేయడానికి ధన్వంతరి అష్ణోత్తర శతనామ అర్చన * సత్ఫలితాన్నిస్తుంది.

2. శ్రీకాళహస్తికి, నాగదోష పరిహారానికి సంబంధం ఏమిటి ?
దక్షిణ కైలాసంగా, దక్షిణ కాశీగా వాసిగాంచినది కాళహస్తి. పూర్వం వశిష్ట మహాముని, తన పుత్ర శోకాన్ని తొలగించుకోవడానికి నిశ్చల భక్తితో తపస్సు చేశాడట. ఆ మహర్షి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు కైలాసం నుండి దిగివచ్చి ప్రత్యక్షమైనాడట. పంచభూత, పంచేంద్రియ, పంచకోశాది, పంచవర్గప్రాయ పంచ ముఖాలతో పశ్చిమాభిముఖుడై లింగాకారమై నిలిచిన ఆ పరమ శివుని దర్శించి, వశిషుడు పుత్ర శోకం తొలగిపోయి, నమస్కరించాడు.
Recommended Video

పరమశివుని ఆజ్ఞపై వశిషుడు బ్రహ్మోపదేశం చేయమని కోరాడు. అపుడు ఆ మహాలింగం లోంచి దక్షిణామూర్తి రూపుడై కైలాసపతి వెలువడి, వశిష్ణునికి బ్రహ్మోపదేశం చేశాడు. ఆనాటి నుండి, భక్తకోటిని అనుగ్రహించడానికి పంచముఖ నాగలింగాకృతిలో స్వయంభువై పరమేశ్వరుడు దక్షిణ కైలాసగిరిలో వెలిశాడు. బ్రహ్మదేవుడు కూడ ఈ నాగలింగాన్ని పూజించి, తరించాడని పురాణ కథనం.
దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగములలో, శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగంగా ప్రసిద్ధి పొందాడు. ఒక ప్రళయం తర్వాత, వాయుదేవుడు శ్రీకాళహస్తిలోని పరమశివుని దర్శించి, పచ్చకర్పూర తీర్థంతో అభిషేకించాడట. ఆనాటి నుండి ఆ శివలింగం వాయులింగంగా విశ్వవిఖ్యాతమైంది. గర్భగుడిలో గాలి చొరని చోటులో అఖండ దీపం చలిస్తూ, పరమశివుని సేవిస్తూ ఉండడం ఈ దక్షిణ కాశీ విశిష్టత. అప్పుడు శివుదు నగులందరికి ప్రీతి క్షేత్రాముగా ఉన్న ఇ కత పూజిస్తే నాగాదోశము శాంతిస్తుందని సెలవిచ్చాడు.












Click it and Unblock the Notifications