కార్తీకంలో తొలి పండుగలు: అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక ‘భగినీ..’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక భగినీహస్తభోజనం, సోదరి తృతీయ అన్నదమ్ములకు ముచ్చటైన ఈ పండగ తెలుగువారందరూ జరుపుకుంటారు. ఇందులో యమపూజ, చిత్రగుప్తుడి పూజా, భగిని గృహ భోజనం వంటివి జరగాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ, భ్రాతృ విదియ, భగినీ హస్తభోజనం అనే పేర్లతో పిలువబడే ఈ రోజుకి పురాణ భోధ మైనటువంటి కథ ఉంది. యమధర్మరాజు సోదరి యమున నది ఆమెను యమునగా పిలుస్తారు. ఎన్నోసార్లు సోదరుడిని భోజనానికి రమ్మని కోరుకున్నది అయినప్పటికీ చాలా సార్లు రాలేకపోయాడు. ఒకనాడు యముడు సోదరి ఇంటికి వెళ్ళాడు కుటుంబంతో ఇచ్చినటువంటి యముడికి యమున సపర్యలు చేసింది. చిత్రగుప్తుడు మొదలైన వారందరినీ గౌరవించింది. దూతలను సేవించింది. తన చేతి తో వండిన భోజనాన్ని వాళ్లకి వడ్డించింది.

ఆశ పరీక్షలకు ఆనందించిన యమధర్మరాజు కానుకగా ఏదైనా ఇవ్వాలని అనుకొని, ఆమె కోరిక మేరకు కార్తీక విదియ రోజున ఆయన మన ఇంట భోజనం చేశాడు కాబట్టి ఆరోజున సోదరి ఇంట భోజనం చేసిన వాళ్లకే ఆయుష్షు పెరుగుతుంది.. నరకలోకప్రాప్తి ఉండదని, అకాల మరణము పొందరని యమధర్మరాజు వరం ఇచ్చాడు.

astrologer tells about karthika masam festivals

సోదరి తృతీయ
సోదరి చేసిన సేవలకి సన్మానితులు నా సోదరుడు ఈరోజు అక్కని లేద చెల్లెలిని ఇంటికి తీసుకువెళ్లి విందు భోజనాలు పెట్టి రసాలతో అత్తవారింటికి తిరిగి పంపుతాడు. ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేయడం కూడా ఒక విశేషం.

నాగదోషాన్ని పోగొట్టే నాగులచవితి
కార్తీకమాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితీ తెలుగునాట నాగుల చవితి పండుగగా జరుపుతారు. శ్రావణ శుద్ధ పంచమిన నాగుల పంచమి. ఆ పండగ కి ఎంత ప్రాధాన్యం ఈ పండగకి అంత ప్రాధాన్యం ఉన్నది.

పురాణగాథ
నాగు పాములు కద్రువ యొక్క సంతానం, వినత సంతానం పక్షులు. అయితే వినతా కద్రువ ఇద్దరు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. వినత కోరిక మేరకు కశ్యపుడు శక్తివంతులైన సర్పములను సంతానంగా కలిగించాడు. నాగుల జాతులు జన్మించినటువంటి రోజుగా ఈ రోజునే నాగులచవితి అనే పేరుతో ప్రసిద్ధి కెక్కింది.

నాగుల కి సంతానానికి సంబంధమేమిటి
సుబ్రహ్మణ్య ప్రతీకాత్మకమైన వంటి నాగులను పోలిస్తే వివాహం అవుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని శాస్త్ర వాక్యం.నాగుపాము సుబ్రహ్మణ్యేశ్వర పరంగా చెబుతారు. సుబ్రహ్మణ్యస్వామి అంగారకుడు లేదా కుజగ్రహానికి అధిదేవత. కుమార స్వామిని పూజించిన కుమార స్వామి నామాలు లేదా స్తోత్రాలు సుబ్రహ్మణ్య అనుగ్రహం జరిగిపోతుందని పరిగణించబడుతుందని జ్యోతిష్కులు చెప్పారు. అటువంటి సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి సర్పాన్ని పూజించే విధి ఈ నాగుల పంచమి.

వెండితో చేసినటువంటి సర్పాన్ని ఇంటిలో పూజించ వచ్చు లేదా పుట్ట దగ్గరికి వెళ్లిపాముల పుట్ట చుట్టూ ప్రదక్షిణ కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో వెండి పాముని బ్రాహ్మణునికి దానంగా కూడా ఇస్తారు.

నాగులచవితి పూజించే విధానం
ప్రత్యేకంగా స్త్రీలు ఉదయ కాలమే లేచి స్నానమాచరించి పసుపు కుంకుమా పాలు మొదలైన మంగళద్రవ్యాలు చేతిలో ధరించి సమీపంలోని పాముల పుట్ట దగ్గరికి వెళ్లి సర్పం నివసించే వంటి పుట్ట దగ్గర పసుపు కుంకుమల చేత పూజించి పండ్లు నైవేద్యాలు గా నివేదన చేసి పాలను అర్పించి ప్రదక్షిణ చేసి ప్రార్థన చేస్తారు.

నడుము తొక్కితే నా వాడనుకో
తోక తొక్కితే తొలగిపోయి
కాచి రక్షించు నన్
తండ్రి నాగేంద్రుడా ఫణీంద్రుడా
ఈ పూజను జాతి కులాలతో సంబంధం లేకుండా అందరూ సర్పాన్ని ఆరాధిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about first festivals in karthika masam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి