ముక్కు మీద పుట్టుమచ్చ వుంటే ఫలితాలు ఎలా వుంటాయ్?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ముక్కు లావుగా ఉన్నచో అధిక మాటకారి. భోళాతనం కలిగి ఉండును.సన్నటి ముక్కు చిన్న నాసికారంధ్రాలు కలవారు, తెలివి తేటలతో గుప్తముగా మాట్లాడుదురు. కాని వారి మాటలలో తెలివితేటలు గోప్యత జాగ్రత్త కనపడును.

ముక్కు చివర:సూ- నాసికా యాం కార్య సాఫల్యం విశారదక్ష ముక్కు చివర పుటుమచ్చ ఉన్నచో చురుకైన తెలివితేటలు, ఆలోచనాశక్తి ఎక్కువగా కలిగి ఉందురు. ఏ పనిచేసినా తొందరగా చేయుదురు. నిముషాలు మీద చేయుదురు. కోపం అధికముగా ఉండును. తలచిన కార్యము పూర్తి అయ్యేవరకు పుట్టదలతో చేయుదురు. యితరులను లెక్కచేయరు. తనవారి సందరిని తనచెప్పుచేతలలో అంటే తనమాట వినేటట్లుగా ఉంచు కొందురు.

 astrologer tells about mole on nose

మొండిపటు ఎక్కువ. తప్పని ప్పుగాగా బుజువు చేయు వరకునిద్రపోరు. అభిమానం, ఆత్మగౌరవము తక్కువ, ఏపనిలో నైనా ప్రవేశించిన దానియందు ప్రావీణ్యత సంపాదింతురు. యితరుల గొప్పతనము గురించి ఎవరైనా చెప్పిన వారిని చులకన చేయుదురు. మాటకారితనము ఉండును. ధనధాన్యములు అభివృద్ధిగా ఉండును. స్థిరాస్థిని అభివృద్ధి చేయును. గర్విష్టి కావడం వల్ల అపుడపుడు యిబ్దందులకు గురి అయిననూ వాటి నుండిఅవలీలగా బయటపడగల వారిరగుదురు.

ముక్కుకి కుడిభాగమున
ముక్కుకి కుడిభాగమున పుట్టు మద్ద ఉన్న కష్టపడి పనిచేయు శక్తి సామర్థ్యములు కలిగి ఉందురు. చూస్తుండగానే ధనవంతుడు కాగల అవకాశము కలదు. కృషికి మించిన ఫలితమును పొందును. దూరదృష్టి కలిగి ఉందురు. మొదట సామాన్యవ్యక్తిగానున్న మిక్కిలి అభివృద్ధిలోకి వచ్చును. ఏ పనిప్రారంభించినా మధ్యలో అదృష్టం కలిసివచ్చి పైకి వచ్చెదరు. సంపదకలిసి వచ్చినా ఎంతో కాలము నిలువక వద్ది పోయినట్లుగా పోవును.

ముక్కుకి ఎడమభాగమున
ముక్కుకి ఎడమ భాగమున పుట్టుమచ్ల ఉన్నచో మంచిదికాదు. పరస్త్రీల యందు ఆసక్తి ఎక్కువ. చేతిలో డబ్బు బజారు పాలై పోవును. ఆదాయము మించి ఇరులు చేయుదురు. భార్యతో సంతృప్తి చెందక పరస్త్రీ వ్యామోహములో పడెదరు. నీచమైన స్త్రీలతోను, తన అంతసుకు సరితూగని స్త్రీలతో సంబంధము కలిగిఉందురు. అపుడప్పుడు వారి వలన ధన సంపాదన కూడా చేయుదురు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about effects with mole on nose.
Please Wait while comments are loading...