కోరిన కోర్కెలు తీర్చే.. సంకష్టహర చతుర్థి ప్రత్యేక ఏమిటి?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గణపతిని పూజించి పూజల్లో చవితి పూజ విశేషమైనది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వరదచతుర్థి అని, అమావాస్య తర్వాత వచ్చే చవితికి సంకష్టహర చతుర్థి అని పేరు. ఈ రోజున వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షని ఆచరించడం విశేషమని చెబుతారు.

వినాయకుడి విశిష్టత
భారతీయ ఋషులు సమాజాన్ని సంఘాన్ని లోతుగా పరిశీలించి జీవన విధానంలో అధ్యాత్మ ప్రాతిపదికలుగా కొన్ని ఆచారాలను నిర్దేశించారు. అందులో ప్రతి పూజలోనూ ప్రారంభంలో విఘ్నేశ్వరుడిపూజ చేయడంవల్ల ఘన బాధలు తొలగుతాయని ఎందరో దేవతలు ఉన్నా ఆది పూజ్యుడు గా వినాయకుని పూజించడం అవసరమని అన్ని మతములు ఘోషిస్తున్నాయి. శ్రీ వైష్ణవులు కూడా విశ్వక్సేనుడు అనే పేరుతో వినాయకుడిని పూజిస్తారు. శాక్తేయ మతస్థులు వినాయకుని గణాధిపతి అనే పేరుతో పూజిస్తారు.

సంకష్ట చతుర్థి విధానము
సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు.

వినాయకుడి పూజా విధానం.
ఈ మాసంలో 23 వ తేది తేదీన సంకష్టహర చతుర్థి జరుగుతుంది. భక్తి శ్రద్ధలు యధాశక్తిగా పదార్థములు ఏర్పాటు చేసుకుని వినాయకుడిని పూజిస్తారు.
వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం దీపం నైవేద్యం ప్రత్యేకంగా వినాయకుడికి అవసరమైనవి. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. శక్తి కొలదీ విగ్రహంలో గాని లేదా పటములో కానీ వినాయకుడిని పూజించవచ్చు. జిల్లేడు గణపతి దీనినే అర్క గణపతి అని కూడా పిలుస్తారు. ఈ మూర్తిని పూజించినా కోరుకున్న కోరికలు తొందరగా తీరడానికి ఒక సాధనం.

దూర్వా పూజ
ఒక్కొక్క దేవతకు ఒక పదార్థం ఒక్కొక్క ఆకు ఒక పువ్వుని విశేషంగా చెబుతారు. ఆ దేవత నివేదించినప్పుడు దైవం ప్రసన్నమై ప్రీతి చెందుతుందని కొందరు దేవుళ్ళకి కొన్ని పదార్థాలను విశేషించి చెప్పారు.
అదేవిధంగా వినాయకుడికి దూర్వా లేదా గరిక అని ఆకుని నివేదించడం విశేషం. లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి నామాలు చెబుతూ నివేదిస్తారు. కుడుములు మొదలయిన పదార్థాలను వినాయకుడికి ఇష్టంగా నివేదిస్తారు.

సంకటహర చతుర్ధినాడు చదివే సంకటనాశన గణేశ స్తోత్రం

Astrologer described about sankashti chaturthi.

నారద ఉవాచ -
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ భక్తావాసం స్మరేనిత్యం, ఆయుష్కామార్థసిద్ధయే
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో!
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః
అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశన గణేశా స్తోత్రం సంపూర్ణం
గణపతి హోమం
గణపతి హోమం చేయడం వల్ల నిద్ర బాధను తొలగడమే కాకుండా నరదృష్టి నివృత్తి జరుగుతుంది.అందుకోసం గా వినాయక హోమాన్ని సంకష్టహర చతుర్థి రోజున జరుపుతారు.
ఈ రోజున బియ్యము అప్పాలు నువ్వులు చెరకు కొబ్బరి శనగలు పేలాలు వంటి ద్రవ్యాలు ఓం లో వేసి నవగ్రహాల మంత్రాలతో కలిపి సమంగా ఆహుతులు గా సమర్పిస్తారు. ఇందులో మరొక విశేషమేమిటంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని అనబడే9 గ్రహాలు, ఇంద్రుడు అగ్ని యముడు నిరృతి వరుణ వాయు కుబేర ఈశాన అనే ఎనిమిదిమంది దిక్పాలకులు,గణపతి దుర్గ ఆభయంకర, మృత్యుంజయ వాస్తు అనబడే 5మంది పంచలోక పాలకులుమొదలైనవారికి పాలివ్వడం వల్ల హోమం చేసే వారికి ఉండే అన్ని రకముల దోషములు నివృత్తి చేయబడతాయి.
వినాయకుడు హోమం చేయడం వల్ల ఇందులో చెప్పబడే కొన్ని మంత్ర ప్రభావమున వల్ల ఇంటికి వ్యక్తులకు ఉండే నరదృష్టి పోగొడుతుంది.
ఇలాగా వినాయక ప్రీతిగా సంకష్ట చతుర్ధి నియమాలను పాటిస్తూ వ్రతాన్ని ఆచరించిన వారికి విద్యార్థులకు కళాకారులకు వ్యాపారస్తులకు వారివారి అభివృద్ధి చేయడమే కాకుండా అపూర్వమైన పుణ్యఫలం సంప్రదించ బడుతుంది.

అచంచలమైన విశ్వాసంతో భక్తీతో శ్రీ మహా గణపతిని పూజించి ఉపవాసాలు నిర్వర్తించు కున్న తర్వాత రాత్రి వినాయకుడికి విభజన నామ జపంతో గడపాలి

ఈ విధంగా 3, 5, 7, 9, 11, 16, లేదా 21 చవితిలో ఆచరించాలి.

సంకట హర చతుర్థి వ్రత కథ
ఒకానొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళుతుండగా ఒక రాజ్యం దాటుతున్న సమయంలో పుష్పకం ఒక్కసారిగా ఆగిపోయిందట. దానికి కారణమేమిటి అని పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన ఒక వ్యక్తి ఒక్క చూపు కారణంగా పుష్పకం ఆగిందని వాలిన దని తెలుసుకున్నాడు. మహారాజుకు చెబుతున్న సందర్భం లో వారిద్దరి ముందునుంచి పుష్పక విమానంలో ఒక పుణ్య స్త్రీ ఆకాశం లోకి తీసుకువెడుతున్నారు.
అలా తీసుకువెళుతున్న దూతలను కారణం అడుగగా... ఆ దూతలు ఈ విధంగా సమాధానం చెప్పారు. ఈమె తన జీవితంలో ఎన్నో పాపములు చేసింది కానీ నిన్నటి రోజు వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్ధి వ్రతాన్ని ఆచరించి ఉంది చంద్ర దర్శనం చేసి మరణించింది కాబట్టి ఆమెకు ఉత్తమ గతులు రావాలి అని శ్రీ మహాగణపతి వారి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెళుతున్నాం అన్నారు.

ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఆ మహారాజు వినాయకుడి యొక్క మహిమ అని తెలుసుకుని అందరికీ ప్రచారం చేయించాడు. అప్పటినుండి సంకష్టహర చతుర్థి ఖ్యాతిని పొందడమే కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి కథను విన్న వాళ్ళకి చూసిన వారికి కూడా శ్రీ మహా గణపతి అనుగ్రహం పొంది సంఘటనలు నివృత్తి సుఖశాంతులను పొందుతారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about sankashti chaturthi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి