2024 సంవత్సరంపై జ్యోతిష్య పండితుల అభిప్రాయం

కొత్త ఆంగ్ల సంవత్సరాది 2024 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రతి చోట ఇప్పటి నుండే వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. కొంతమందైతే కొత్త ఏడాది ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇప్పటి నుండే పంచాంగ కర్తలను సంప్రదిస్తున్నారు. వాస్తవానికి కొత్త పంచాంగం అనేది ఉగాది రోజు వస్తుంది.

గ్రహాల మీద ఈ ప్రపంచం మొత్తం ఆధార పడి ఉందనే విషయాన్ని గుర్తించాలంటున్నారు. 2024 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయని, అయితే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. మకర సంక్రాంతి పురుషుడు నామధేయం ద్వాంక్ష గా తెలిపారు. ఈ సంవత్సరం దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, అలాగే ఈ దొంగలవల్ల దేశం మొత్తం ప్రభావితమవుతుందంటున్నారు.

Astrology experts opinion on 2024 year

రాజుగా కుజ భగవానుడు రావడం, మంత్రిగా శని భగవానుడు రావడంవల్ల ఈ ఏడాది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటువంటి వైపరీత్యాల నుండి బయటపడేందుకు గ్రహాల ఆరాధన, భగవంతుడి ఆరాధన ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచిస్తున్నారు. రాజకీయాల పరంగా చూస్తే ఇవి ఎన్నో ఆటుపోట్లకు గురయ్యే స్థితి ఉంటుందంటున్నారు.

పాడిపంటలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకు గోమాతకు ప్రతిరోజు పూజలు చేస్తే వైపరీత్యాల నుండి పాడిపంటలు బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే కొత్త ఏడాదిలో అందరూ కాకికి ఆహారం, నువ్వుల నూనెతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించాలని, అప్పుడు భగవంతుడి ఆశీస్సులతో కొత్త సంవత్సరం ఆనందమయంగా సాగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+