ధనశక్తి రాజయోగంతో ఈ రాశుల పంట పండింది
ఈ నెల 23వ తేదీన నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి సంపదకు, ఐశ్వర్యానికి కారకుడయ్యే శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. అలాగే గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా అక్కడే ఉంటాడు. ఈ గ్రహాల ప్రభావంతో ఎంతో శక్తివంతమైన ధనశక్తి రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల తలరాత పూర్తిగా మారిపోనుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మకర రాశి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నవారికి కోరిక నెరవేరే సమయం ఇది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మతపరమైన విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఏ పనినైనా పూర్తిచేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు.

కుంభరాశి
ఈ రాశిలో జన్మించినవారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ధనశక్తి రాజయోగంతో వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా మారతాయి. డబ్బులు సంపాదిస్తారు. కీలకమైన ఒప్పందాలు కుదురుతాయి. అసంపూర్తిగా ఉన్న పనులు కూడా చాలా తేలికగా చేసేస్తారు. దీనివల్ల మీకు మంచిపేరు వస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు కలుగుతాయి.
మిథున రాశి
ఆర్థికంగా బలపడటానికి, డబ్బు సంపాదనకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. డబ్బును పొదుపు చేసుకుంటే చాలా మంచిది. భవిష్యత్తులో అనేక లాభాలుంటాయి. మానవ సంబంధాలన్నీ చాలా మధురంగా మారతాయి ఈ రాశివారికి. అలాగే వివాదాలకు తావివ్వకుండా మౌనంగా ఉండాలి.. లేదంటే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి
వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వినియోగదారులు పెరుగుతారు. భవిష్యత్తులో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటివల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సహకారంతో కష్టమైన పనులను చాలా సులభంగా పూర్తిచేసి అనుకున్న ఫలితాలను పొందుతారు.












Click it and Unblock the Notifications