మీ జాతకంలో గురు దోషాన్ని గుర్తించి ఇలా పరిహారాలు చేయండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో గురువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మనిషి జాతకంలో గురుడు బలంగా ఉంటే ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. అలాకాకుండా అశుభ స్థానంలో ఉంటే సమస్యలు ఎదురవుతాయి. వీరికి ఇంట్లోనేకాదు.. సమాజంలో కూడా గౌరవం లభించదు. ఏ పని తలపెట్టినా ప్రతికూల ఫలితాలే ఎదురవుతుంటాయి. జాతకంలో గురుడి స్థానాన్ని మార్చుకోవడానికి కొన్ని నివారణలున్నాయి. దీనివల్ల గురు గ్రహానికి సంబంధించిన దోషాలన్నీ తొలగి శుభ ఫలితాలు వస్తాయి.

గురుడు చెడు స్థానంలో ఉంటే మానసిక ఆందోళన, ఆర్థిక నష్టాలు, అనారోగ్యంలాంటివి ఎదురవుతాయి. విద్యార్థులు రాణించలేరు. ఈ సమయంలో సాధించిన విజయాలు కూడా వేరేవారి ఖాతాలో పడిపోతాయి. వ్యక్తిగత జీవితంలో వివాహానికి తరుచుగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. నానబెట్టిన శనగపప్పును బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. గురువారం రోజు అరటిచెట్టును పసుపు గుడ్డలో కట్టి కుడిచేతితో పట్టుకోవాలి. ధరించే ముందు పూజించాలి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు లేదంటే కుంకుమ వేసుకుని స్నానం చేయాలి.

astrology tips for guru dosha in your horoscope

ఎవరి జాతకంలో గురు దోషం ఉంటుందో వారు పసుపును పూజా సమయంలో ఉపయోగించాలని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. నుదుటిపై తిలకంలా దిద్దుకోవాలి. మణికట్టు, మెడమీద పసుపు బొట్టు పెట్టుకోవడంవల్ల గురుడు బలపడతాడని చాలామంది నమ్ముతారు. పెళ్లికి ఆటంకాలు ఎదురవుతుంటే ప్రతి గురువారం వినాయకుడిని పూజించాలి.

పూజ చేసే సమయంలో గణేశుడికి పసుపును సమర్పించాలి. జీవిత భాగస్వామితో తరుచుగా గొడవలు జరుగుతుంటే ఇంటికి సంబంధించిన ప్రధాన గోడపై స్వస్తిక్ చిహ్నాన్ని వేయాలి. అలాగే కుటుంబంలో ఏదైనా సమస్య ఎదురైతే కుండలో మంచినీటిని తీసుకొని అందులో కొంచెం గంగాజలం, కొంచెం పసుపు కలిపి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లాలి. దీనివల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+