శ్రావణమాసంలో అష్టైశ్వర్యాలు పొందాలంటే ఇలా చేయండి
పవిత్రమైన శ్రావణ మాసం ఈనెల ఐదోతేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో లక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుతోపాటు శ్రేయస్సు, ఆనందం, శాంతి కలుగుతాయి 16వ తేదీన వ్రతం చేసుకోవడం వీలుకాకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో చేసుకోవచ్చు.
గుమ్మానికి మామిడాకులు కట్టాలి
వరలక్ష్మీ వ్రతం చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. వీటితోపాటు పూలదండలు కూడా కట్టుకోవాలి. విద్యుత్తు దీపాలతో లేదంటే ప్రమిదల్లో నూనె పోసి వెలిగించి ఇంటిని అలంకరించుకోవాలి. ఇంటితోపాటు పూజ చేసే మండపాన్ని అలంకరించుకోవాలి. మండపాన్ని శుభ్రం చేయడంతోపాటు వరిపిండితో ముగ్గులు వేసి నలువైపులా మామిడాకులు కట్టి అలంకరించుకోవాలి. దీన్ని తూర్పు దిశగా పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

కలశాన్ని అలంకరించుకోవాలి.
బంగారం, వెండి, రాగి.. ఇలా దేంతో చేసిందైనా సరే కలశాన్ని అలంకరించి, బియ్యం పోసి పళ్లెంలో ఉంచుకోవాలి. కలశంలో ఉన్న బియ్యంలో నిమ్మకాయ, తమలపాకులు, నాణాలు ఉంచి చుట్టూ మామిడాకులు పెట్టి పసుపు రాసి అందులో కొబ్బరికాయ పెట్టాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ప్రతిమ లేదంటే ఫొటోను కూడా పెట్టొచ్చు. అమ్మవారిని ఎర్రటిరంగు జాకెట్ ముక్క, ఆభరణాలు, పూలతో అలంకారం చేసి దీపాలు వెలిగించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత పూజల ప్రారంభించాలి. ఇలా చేయడంవల్ల ఎంతో మంచిది. పూజను నిష్టగా చేసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న పూజారులను, పండితులను సంప్రదించి ఆ ప్రకారం ఇంకా బాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి సంతోషం కలిగించేలా పూజ చేస్తే పేదరికం దూరమవడంతోపాటు సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం సమకూరతాయి. శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం పండగలా చేసుకోవచ్చు. ఆరోజు పూజ వల్ల లక్ష్మీదేవి ఇంటికి నడిచివస్తుందంటారు.












Click it and Unblock the Notifications