ఆరోగ్య స్నానానికి ఆయుర్వేద పద్దతులు ..ఎలాంటి స్నానం చేస్తే ఎలాంటి లాభాలున్నాయి
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
స్నానము చేయుట వలన శారీరక మలినములు తొలగి దేహమునకు ఆరోగ్యము మరియు ఉత్సాహము లభించును. ఆరోగ్యవంతులకు చన్నీటిస్నానం మంచిది . జబ్బుపడి లేచినవారికి దగ్గు, నెమ్ము , ఆయాసము కలిగినవారికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయుట ఆరోగ్యమును కలిగించును. ఆయుర్వేదం స్నానం చేయు నీటిని గురించి ఈ విధముగా వివరించింది. నదీజల స్నానం ఉత్తమ ఫలితమును కలిగించును. చెరువు లేదా తటాకం నందలి నీటితో చేయు స్నానం మధ్యమ ఫలితం కలిగించును. కూప జలం అనగా బావి నందలి నీటితో చేయు స్నానం అధమ ఫలితం కలిగించును. కుండలు మరియు ఇతర పాత్రల యందు నిలువ ఉంచిన నీటితో స్నానం చేయుట కూడా అధమ ఫలితాన్ని ఇచ్చును.
స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేడినీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి 1. జలము మరియు 2. అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు.
* స్నానము చేయుటకు ముందు శరీరంలో ఏ భాగమునకు ఆ భాగము నూనెతో రుద్దుకొనవలెను. కొందరు సెనగపిండి , పెసరపిండితో మరియు సున్నిపిండితో నలుగు పెట్టుకుంటారు. అవయవ మర్దన వలన నూనె రోమ రంధ్రముల ద్వారా శరీరలోపలి భాగములకు ప్రవేశించును. తదుపరి అరగంటసేపు ఆగి స్నానం చేయుట మంచిది.
* స్నానము చన్నీటితో చేయుట మంచిది. ప్రతిదినము చన్నీటితో స్నానము చేయుట వలన జీర్ణశక్తి అధికము అగును. అంతేకాక ఆయుర్వృద్ధి కలుగును. తద్వారా ఉత్సాహము, బలం, ఆరోగ్యము లభించును.
* ఆయుర్వేద గ్రంధాలలో "త్రిపిస్నానం" గురించి వివరించబడినది. అనగా ప్రతి రోజు మూడు పూటలా స్నానం చేయవలెను అని చెప్పబడినది.
* ప్రతి దినం వేడినీటితో స్నానము చేయరాదు. అధిక వేడి నీటితో అస్సలు చేయకూడదు. అలా చేసిన వెంట్రుకలకు, నేత్రములకు బలము తగ్గును.
* భోజనం చేయుటకు ముందే స్నానం చేయవలెను. కడుపు ఉబ్బరం, పీనస రోగము గలవారు రోజుకి ఒక పర్యాయము చేసిన చాలును. వీరు ఎక్కువ సార్లు స్నానం చేయరాదు .
* నోరు, చెవులు, ముక్కు వ్యాధులు కలిగినవారు, పక్షవాత రోగులు చన్నీటి స్నానం ఆచరించకూడదు.
* ఆరోగ్య వంతులు తలకు నూనె మర్దన చేసుకుని స్నానం చేయుట మంచిది.
* చెవిలో తైలం వేసుకొని స్నానం చేయుట మంచిది. తలకు, అరికాళ్లకు తైలమును మర్దించి స్నానం చేయుట వలన శరీరముకు చలవ చేయును .
* మగవారు శనివారం, ఆడవారు శుక్రవారం తలంటుకుని స్నానం చేయుట మంచిది.
* దగ్గు, నెమ్ము వంటి వ్యాధులు కలవారు మరియు విరేచనముకు మందువాడి ఎక్కువసార్లు విరేచనం అయినవారు, అజీర్ణ వ్యాధిగ్రస్తులు తలస్నానం చేయరాదు.
* ఆరోగ్యవంతుడు ప్రతిరోజు మామూలు స్నానం చేయుట మంచిది. తలకు నూనె పట్టించి తలస్నానం చేయుట వారానికి ఒకసారి చేయుట మంచిది.
* చర్మ సౌందర్యానికి రసాయనాలతో చేసిన ఉత్పత్తుల కంటే మెరుగైన ఫలితాలనిచ్చే సహజసిద్ధమైన వనరులెన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో వేప, తులసి, పసుపు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
వేప:- ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలం. చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లను నియంత్రించడంలో వేప ఆకు బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై మంట తగ్గిస్తుంది. వేప కలిపిన నీటితో స్నానం చేస్తే ఎన్నో చర్మ వ్యాధులను దూరంగా పెట్టచ్చు.
పసుపు:- మన వంటింట్లో అనాదిగా ఉపయోగిస్తున్న అద్భుత పదార్థం పసుపు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ కాంపోనెంట్స్ అధిక మొత్తంలో ఉంటాయి. మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు, వృద్ధాప్యపు ఛాయలు, సొరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలకు ఔషధంలా పని చేస్తుంది. రోజూ వంటల్లోనే కాకుండా పాలల్లో కూడా పసుపు వేసుకొని తాగితే మంచి ఫలితాలుంటాయి.
తులసి:- ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై నల్లమచ్చలు, మొటిమలు, ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో దోహదపడతాయి. తులసిలో విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్స్ అధికం. ఇది రక్తప్రసరణను ప్రేరేపించి జుట్టు పెరగడానికి ఉపకరిస్తుంది.
-
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
బడ్జెట్లో స్మూతీ మేకర్స్ కావాలా.. బెస్ట్ డీల్స్ ఇవే ?? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications