ఏఐపై ముందే చెప్పిన బాబా వంగా.. 2026 గురించి తీవ్ర హెచ్చరిక!
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలలోనూ విస్తరించింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. మానవ వనరుల స్థానంలో ఏఐ పని చేస్తున్న క్రమంలో అనేక కార్పోరేట్ ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థలు
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్ళకు పంపించాయి. దీంతో కృత్రిమ మేధస్సు (AI) పరిశ్రమపై అతి అంచనా, ఉద్యోగ కోతల భయాలతో ఐటీ రంగం అనిశ్చితిలో చిక్కుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, గూగుల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ ఐటీ దిగ్గజాలు సంస్థాగత పునర్నిర్మాణం, ఖర్చుల తగ్గింపు చర్యలలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి.

ఏఐ గురించి ముందే చెప్పిన బాబా వంగా
భారీ తొలగింపులు, AI సాఫ్ట్‌వేర్‌లు ఐటీ ప్రపంచాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో దీనికి సంబంధించి ముందే జ్యోతిష్య అంచనాలను బాబా వంగా వెల్లడించారు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'బాల్కన్స్ నాస్ట్రాడమస్'గా పేరు గడించిన బాబా వంగ, గ్రహాంతరవాసులతో మనుషులు కలిసే అనేక అంశాలతో సహా పలు భవిష్యవాణులను చెప్పి గుర్తింపు పొందారు.
బాబా వంగా అంచనాలు నిజం
ఆమె చేసిన అనేక జ్యోతిష్య అంచనాలు ఇప్పటికే నిజం అయ్యాయి. అంధురాలైనప్పటికీ భవిష్యత్తును చూడటంలో ఆమె జ్ఞాన దృష్టి చాలా ప్రత్యేకమైనది. గతంలో, సెప్టెంబర్ 11 దాడులు, 2004 హిందూ మహాసముద్ర సునామీ వంటి ప్రధాన సంఘటనలు మాత్రమే కాదు ప్రపంచ యుద్ధాలకు సంబంధించి కూడా బాబా వంగా తన జ్యోతిష్య శాస్త్ర అంచనాలలో పేర్కొన్నారు.
ఏఐ గురించి బాబా వంగా చెప్పింది ఇదే
బాబా వంగా 1996లో కన్నుమూసినా, ఇప్పటికీ ఆమె చెప్పిన భవిష్య వాణీ అంచనాలు అనేకం నిజం అవుతూ వస్తున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి, ఉద్యోగ కోతలకు సంబంధించిన ఆమె ఒక పాత అంచనా ఇటీవల వైరల్ అయ్యింది. ఆమె జోస్యం ప్రకారం, 2026లో AI మానవ జీవితంపై కీలక ప్రభావం చూపుతుంది. ఇది మానవ నియంత్రణను మించిపోయే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు.
బాబా వంగా హెచ్చరికలతో ఆందోళన
AI సాంకేతికతలలో వేగవంతమైన పురోగతి, కృత్రిమ మేధస్సుతో ముడిపడిన నైతిక, భద్రతా సమస్యల ఆందోళనల మధ్య బాబా వంగా ఈ అంచనా ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారం అవుతుంది . భవిష్యత్తులో ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని బాబా వంగా అంచనా వేసిన క్రమంలో , AI సిస్టమ్‌లను అభివృద్ధి చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలని చెప్తున్నారు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications