21/22 తేదీలు ఖగోళంలో భూమి 'విషు' స్థితి మార్పు, భయాందోళనపై..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఈ డిసెంబర్ 21 తేదిన జరిగే మార్పును అనవసరంగా ప్రజలను భయాందోళనకు గురి చేశారు. ఇది ప్రతి సంవత్సరం ఖగోళ పరంగా మార్పు జరిగేదే. ఈ మార్పు వలన ఎలాంటి విపత్తులు జరగవు. ఇది పుష్య(శున్య)మాసం సూర్యుడు ధనుస్సు రాశిలోప్రవేశించడం వలన ధనుర్మాసం అంటారు. ఈ మాసంలో ప్రకృతిలో మరియు దేహంలో అనేక మార్పులు చెందుతుంది. పైగా చలి అధికంగా ఉండడం వలన సప్తధాతువుల మిలితమైన మానవ శరీరంలో అనేక మార్పులను చోటుచెసుకుంటుంది. కావున వివాహం మొదలైన శుభకార్యాలు చేయడం వలన "ధాతు" సంబంధమైన కొన్ని శారీరక అనారోగ్యాలు ఏర్పడతాయి కాబట్టి శాస్త్రంలో మన పెద్దలు మానవుల ఆరోగ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకుని శుభ కార్య ముహూర్తాలు ఇవ్వలేదు. అంతే తప్ప వేరేమి కాదు. విజ్ఞతతో ఆలోచించి ఖగోళ పరంగా ఆలోచించి చూస్తే...

Celestial change every year

ప్రతి యేట తేది 21 నాడు సూర్యుడు ప్రయానించే మార్గంలో మార్పు వస్తుంది. దానినే విషువత్తు అంటారు.జ్యోతిష శాస్త్ర ప్రకారంగా భూమి తనచుట్టు తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది.దీని వలన మనకు పగలు, రాత్రి ఏర్పడుతుంది. ఈ పగలు కాలం 12 గంటలు,రాత్రి సమయం 12 గంటలు మొత్తం కలిపి 24 గంటల సమయం పడుతుంది.అదే విదంగా భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుటకు(ప్రదక్షిణకు) పట్టే కాలం ఒక సంవత్సరం అవుతుంది.భూమి సూర్యుని చుట్టు చేసే ప్రదక్షిణకు 365.25 రోజులు పడుతుంది.ఈ విషయం అందరికి తెలిసినదే.

ఇది కాకుండా భూమికి ఇంకో చలనం కూడా ఉంటుంది.దీనిని ఖగోళ పరంగా చూస్తే "భూ అక్ష చలనం" లేదా "విషువచ్చలనం" అనికూడా అంటారు.ఈ ప్రభావం సుస్థిరగా ఉండదు.2000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దృవం అలాగే ఉండక భూ అక్షం దృవతార నుండి 30 దిగ్రీలు పక్కకు జరిగి మరో నక్షత్రం ధ్రువతార అవుతుంది.మనం గమనించ వలసిన విషయం ఇక్కడ స్థాన చలనం పొందుతున్నది ధ్రువతార కాదు.కదులుతున్నవి "విషువత్ స్థానాలు" అని అర్ధం అవుతుంది.

ఇక్కడ రెండు వృత్తాలు ఖండించుకుంటున్నాయి.వాటిలో ఒకటి పన్నెండు రాశుల ద్వారా సూర్యుడు ప్రవేశించి, ఏడాదికి ఒక చుట్టు వచ్చే "రవిమార్గం" మే ఇది స్థిరంగా ఉంటుంది.ఈ రవి మార్గాన్ని23 1/2 డిగ్రీల వాలులో "భూమద్యరేఖ" రెండు బిందువుల మద్య ఖండిస్తుంది.ఈ ఖండన బిందువులనే "విషువత్తులు" అంటారు. అవి రెండు ఒకటి వసంత విషువత్తు, రెండవది శరద్విషువత్తు అంటారు.ఈ విషువత్తులు మార్పు చెందిన రోజులలో పగలు,రాత్రి సరి సమానం ఉంటుంది. ఇవి కాక మిగితా రోజులలో పగలుకొన్ని రోజులు ఎక్కువగా,ఇంకొన్ని రోజులు రాత్రి సమయం ఎక్కువగా ఉంటాయి.

ఈ రెందు బిందువులు కాకుండా మరో ముఖ్యమైన రెండు బిందువులు కూడా ఉన్నాయి. అవే ఉత్తరాయణం, దక్షిణాయణం, ఉత్తరాయణం అంటే సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరముగా సంచరించును. దక్షిణాయణంలో సూర్యుడు భూమద్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఈ అయనాంతాలలో ఒకటి ఉత్తరాయణాంతం గ్రీష్మ సంక్రమణం ,రెండవది దక్షిణాయనాంతం లేదా హిమ సంక్రమణం అంటారు.గ్రీష్మ సంక్రమణంలో సూర్యుడు చాల వేడి అత్యదికంగా ఉంటుంది.హిమ సంక్రమణంలో చలి అత్యధికంగా ఉంటుంది. ఈ విధంగా భూ అక్షం బొంగరాన్ని తిప్పినపుడు కొద్దిగా పక్కకు ఒరిగి నెమ్మదిగా గుండ్రని వలయాలు చుడుతుంది. అదే విధంగా భూమి వంగి ఉన్న దిశ మారుతూ ఉంటే నక్షత్రవీధిలో మద్యరేఖ స్థిరంగా ఉండక కదిలిపోతూ ఉంటుంది.ఇదే విధంగా ప్రతి యేట వసంత విషువత్తు మార్చి 21 తేదిన, సెప్టెంబర్ 23 సరద్విషువత్ వస్తుంది.ఉత్తరాయణాంతం జూన్ 22 తేదిన, దక్షిణాయణాంతం డిసెంబర్ 22 తేదిన సూర్యుడు తను భూ కక్ష్య మార్గన్ని మారుతుంటాడు. నక్షత గోళంలో భూ కక్ష్య మార్గాన్ని విషువచ్చలనం(PRECESSION OF EQUINOXES)అని అంటారు.

Celestial change every year

ఈ పుష్యమాసం( ధనుర్మాసం)లో కూడా మనలను అపోహలతో భయందోళనకు గురి చేసున్న వార్త తేది 21-12-2017 గురువారం రోజున కూడా సాధారణ శుభ సమయాలు ఉదయం 11:00 నుండి 11:45 ని.షాల వరకు తిరిగి సాయంత్రం 04:20 నుండి 05:06 ని.షాల వరకు,తేది 22-12-2017 శుక్రవారం రోజున ఉదయం 10:02 నుండి 11:41 వరకు,మధ్యహన్నం 03:01 నుండి 05:02 వరకు ,రాత్రి 09:26 నుండి 11:32 వరకు చిన్న చిన్న సాధారనమైన పనులను చేసుకోవచ్చును.అనవసరమైన అర్ధంలేని అపోహలను నిర్ములన కోరకే శాస్త్రీయ ఆధారల్తో ఈ వ్యాసాన్ని రూపోందించడం జరిగింది.

జై శ్రీమన్నారాయణ.

------------

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The change of December 21 was unnecessarily panic among the people. It is a celestial change every year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి