శ్వాసపై ధ్యాస

Posted By:
Subscribe to Oneindia Telugu

మానవ శరీరం పంచభూతలతో ఏర్పడినది అని శాస్తాలు చెబుతున్నాయి. అవి 1) ఆకాశము 2 ) గాలి 3) అగ్ని 4) నీరు 5) భూమి ఈ ఐదింటిలో పాణకోటి జీవించి ఉండడానికి గాలి అతి ముఖ్యమైనది అది ఎలా అంటే ప్రాణ వాయువు వలన ప్రాణుల శరీరాలన్నిటికి ప్రాణశక్తి అవుతుంది. కావునా ప్రాణాయానం ( మెడిటేషన్) చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. నీరు లేకుండా ,ఆహారం లేకుండా ప్రాణికొన్ని రోజులు బ్రతికి ఉండవచ్చునేమో కాని,గాలి లేకుండా కొన్ని నిముశాలైనా ఉండాలేము.జీవి ప్రాణం గాలి మీద ఆధారపడి ఉన్నది. ప్రాణానికి గాలే ముఖ్యాఆధారం. గుండె, శ్వాసకోశములు , మెదడు,వెన్నుపాము తదుతర శరీర అవయవములన్నింటికి కావలసిన శక్తి అందించేది వాయువే (గాలి) మన శరీర అవయవాలు అన్ని గాలి వలన పనిచేసున్నవి, వాయువును నియంత్రించి , సరిదిద్దే విదానమే ప్రాణాయామము అనబడుతుంది. మనస్సును స్థిరంగా ఉంచుకోని శ్వాస తీసుకునేప్పుడు నిశ్శబ్ధంగా,నెమ్మదిగా రెండు ముక్కురంధ్రాల నుండి గాలిని లోపలికి తీసుకోని వదిలే సమయంలో ద్యాసంతా గాలిని ఏ విదంగా తీసుకోని వదులుతున్నామో ఆనిశ్శబ్ధ స్థితిలో గాలినే గమనించే దానినే ధ్యానం అని అంటారు. ఈ ధ్యానం ద్వారనే భగవంతుని కూడా దర్శించవచ్చును.

మనిషి ఒక నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు.100 నుండి 120 సం.. బ్రతుకుతాడు. తాబేలు 3 సార్లు శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకుతుంది.

ఐతే శ్వాసలు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగుతుంది....? దీనిని సశాస్త్రీయంగా చూసినట్లైతే.... అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మన అందరికీ తెలుస్తుంది.

మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణం లోనూ మైతోకాన్ద్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.
ఈ మైతోకాన్ద్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీనిద్వారా ఉష్ణం పుడుతుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తి. ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివరవరకూ ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తున్నది. ఇలా ఒక్కొక్క కణం నిముషానిక్ 15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.ఎందుకంటే మనం నిముషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి. ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పని చేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది. ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలోంచి బయటకు వెళ్లిపోతాయి. ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది.

ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే....ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్మి, మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి. పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగల్గుతాయి. అందుకే ప్రతిదినం మన విసర్జన క్రియ అతి ముఖ్యమైనది. ఎవరైతే మాల విసర్జన సరిగా చెయ్యరో వారి శరీరం నిండా ఈ మృత కణాలు(toxins) నిండిపోయి సరిగా ఉష్ణం జనించక తీవ్ర రోగాల బారిన పడతారు కనుక ఈ టాక్సిన్ లను బయటికి పంపే డిటాక్సీఫీకేషన్(విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 5 రోజులు జీవిస్తుంది 13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 7 రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాలు పనిచేసే కాలం పెరుగుతుంది. ఏ విధంగా ఒక యంత్రం ఎక్కువ పనిచేయిస్తే అంత త్వరగా పాడైపోతుంది పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పనిచేస్తుందో అలాగే ఈ కణాలు కూడా

భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని 3 నుండి 21 రోజుల వరకు పెంచి 2100 సంవత్సరాలు కూడా జీవించగలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునేకొద్దీ శరీరంలోని ప్రతీ కణంపై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది. ప్రాణయామసాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పనిరోజులని పెంచగల్గితే మన శరీరం లోని ప్రతి అవయం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే అవయవాలు అంటే కణాల సముదాయమే.
ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క ఆయుష్షు పెరిగితే మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.

మనం ఒక్క శ్వాసను తగించ గల్గితే 20 సంవత్సరాల ఆయుష్షును పెంచుకోవచ్చు
యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే తాము ఏరోజు మరణించే విషయం గురించి ముందేచెప్పేవారు. యోగులు ప్రాణాయామం , యోగ సీక్వెన్స్ లను తయారు చేశారు. పతంజలి అష్టాంగ యోగం నందు ఈ క్రమ పద్ధతి వివరం గా తెలియజేసారు. క్రమబద్ధీకరణ తో కూడిన ప్రాణాయామమే గొప్ప ఫలితాలనిస్తుంది.వాయువు సహజ గుణము "కదలిక" వాయువు యొక్క పనిని బట్టి దానిని ఐదు భాగాలుగా విభజించారు. అవి1) ప్రాణము 2) అపానము 3) ఉదానము 4) సమానము 5) ధ్యానము. ఇవి కాక ఐదు ఉపప్రాణములున్నవి వీటన్నిటి కలయిక శరీరంలో ప్రాణమయకోశమని పిలవబడుతుంది. ఈ ప్రాణాయనము చేయడంద్వారా ముఖములో ఆకర్షణ , మనసుకు స్థిరత్వము,శరీరంలోని జీర్ణశక్తి చక్కగా పనిచేయిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యంతో కూడిన ఆయుషును పెంచుతుంది.

----

డా. యం. ఎన్. చార్య- 9440611151
జ్యోతిష మూహూర్త సార్వభౌమ " ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత "
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.తార్నాక-హైదరాబాద్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
About Concentration on Swasa.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి