వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతాఫలం పండు: ఆరోగ్యానికి సీజనల్ ఫ్రూట్స్ వదలకుండా తినాలి..ఈ పండు స్పెషాలిటీ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ప్రకృతిలో పండ్లలో తీపికరమైన పండ్లు చాలా ఉంటాయి. వాటిలో కమ్మని వాసన వెదజల్లే పండ్లు కొనైతే సువాసన పరిమళం వెదజల్లన్నితీపిరకమైనవి కొన్ని ఉన్నాయి. మధురమైనది మామిడిపండు. ఎంతో దూరం నుండి వాసన వస్తేనే తినాలనిపించే పనస పండు. తొక్క ఒలుచుకునే శ్రమ లేకుండా కొరికి తినగలిగే సౌలభ్యం జామపండు. తియ్యని గుజ్జు మాత్రం అమృతాన్నే తలపిస్తుంది. అందుకే అదంటే అందరికీ అంతలా ఇష్టం. 'అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్'గా పేరొందిన దానిపేరే సీతాఫలం.

 సీతాఫలంలో అవసరమైన ప్రొటీన్లు

సీతాఫలంలో అవసరమైన ప్రొటీన్లు

'పచ్చనిమేడ... తెల్లని గదులు... నల్లని దొరలు... చెప్పకోండి చూద్దాం...' అంటే పిల్లలు కూడా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఒలుచుకుని తినడం కష్టమైనా ఆ రుచిని ఇష్టపడని వాళ్లు అరుదే. రాళ్లల్లో రప్పల్లో ఎక్కడంటే అక్కడ సులభంగా పెరిగినప్పటికీ సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లూ పీచూ ఖనిజాలూ విటమిన్లు పిండిపదార్థాలు కొద్దిశాతం కొవ్వు అన్ని పోషకాలు దొరుకుతాయి. కారణాలేమయినా ఈ పండు దొరికినన్నాళ్లూ చాలా మంది దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. పల్లెల్లో అయితే లేవడం ఆలస్యం... పండిన పండ్లన్నీ ముందుగా ఏరుకుని వాటిని ఆస్వాదించడమే పనిగా పెట్టుకుంటారు. సీతాఫలం గుజ్జు రక్తంలో 'హీమోగ్లోబిన్' శాతాన్ని బాగా పెంచుతుంది. అందుకే దీన్ని ఇరవయ్యొకటో శతాబ్దపు సూపర్ ఫ్రూట్‌గానూ అభివర్ణిస్తున్నారు.

 16వ శతాబ్దంలో మనదేశంలోకి సీతాఫలం

16వ శతాబ్దంలో మనదేశంలోకి సీతాఫలం

మెక్సికో, మధ్య దక్షిణ అమెరికాల్లో పుట్టిపెరిగిన సీతాఫలం ( అనోనా స్క్వామోజా ) మనదగ్గరకు పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లతోపాటు వచ్చి కొండకోనలన్నీ అల్లుకుపోయింది. ఇదే జాతికి చెందిన మరికొన్ని రకాలున్నాయి. వాటినే రామాసీతాఫలమని ( అనోనా రెటిక్యులేటా ) హనుమాన్ (అనోనా చెర్మోయా ) ఫలమని లక్ష్మణ (అనోనా మురిక్యులేటా ) ఫలమని పిలుస్తున్నారు. ఈ పేర్లన్నీ ఎవరు ఎందుకు పెట్టారో తెలియదుకానీ అవి అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం పొందడం విశేషం. ఇటీవలే సీతాఫలం, హనుమాన్ ఫలాలను సంకరీకరించి అట్మోయా అనే మరో హైబ్రిడ్ పండుని రూపొందించారు.

3.

 మందుల తయారీలో సీతాఫలం

మందుల తయారీలో సీతాఫలం

సీతాఫలంతో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. అయినప్పటికీ మనదగ్గర తియ్యని సీతాఫలం వాడుకే ఎక్కువ. తియ్యని ఆ రుచి వల్లే దీన్ని షుగర్ ఆపిల్ అని పిలుస్తారు. ఈ జాతి పండ్లన్నీ కూడా ఔషధఫలాలే. మన ఆయుర్వేద వైద్యంతోబాటు స్థానిక దక్షిణ అమెరికన్లు సైతం ఈ చెట్ల భాగాలన్నింటినీ కూడా మందుల తయారీలో వాడేవారు. దానికితోడు ఇటీవల ఈ చెట్లన్నింటిలో క్యాన్సర్‌ను నివారించే గుణాలున్నాయని గుర్తించారు.

 సీతాఫలంతో ఉపయోగాలు

సీతాఫలంతో ఉపయోగాలు

ఈ పండ్లన్నింటినీ నేరుగా తినడంతోబాటు స్వీట్లూ, ఫుడ్డింగుల్లోనూ వాడుతుంటారు. ప్రత్యేక వంటలు కూడా చేస్తుంటారు. కేకులూ కుకీలూ వండేస్తున్నారు. సీతాఫలం గుజ్జుని ఎండబెట్టి ఫ్లేక్స్, పొడి... వంటివి కూడా తయారుచేస్తున్నారు. అందుకే ఒకప్పడు కొండల్లో మాత్రమే పెరిగే సీతాఫలాల్లో మేలైన వంగడాలను రూపొందించి మరీ ప్రత్యేకంగా సాగుచేస్తున్నారు.సీతాఫల్ ఐస్‌క్రీమ్ దొరికే కాలం కూడా ఇదే. తక్కువ వెన్న ఉన్న క్రీమూ, సీతాఫలాల గుజ్జుతో చేసే ఐస్‌క్రీమ్‌కి చిరునామా భాగ్యనగరమే. ఇప్పుడిప్పుడు కొన్ని బ్రాండెడ్ కంపెనీలు రకరకాల పండ్లతోనూ ఐస్‌క్రీములు తయారుచేస్తున్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే బ్రాండేడయినా సీతాఫల్ ఐస్‌క్రీమ్‌ను రుచి చూడగలిగేది మాత్రం ఈ ఒక్క సీజన్‌లోనే మరి.

 గర్భిని స్త్రీ పండంటి పాపాయిని జన్మ నివ్వడం కోసం:-

గర్భిని స్త్రీ పండంటి పాపాయిని జన్మ నివ్వడం కోసం:-

మధురమైన సీతాఫలంలో పోషకాలు ఎక్కువే. ఈ జాతికి చెందిన ఇతర ఫలాలన్నింటిలోనూ ఆయా పోషకాలన్నీ ఉంటాయి. దీన్ని మెక్సికన్లు దక్షిణ అమెరికన్లూ పూర్వకాలం నుండి కూడా జ్వరం, పొట్టనొప్పి, బిపి ... ఇలా అనేక వాధ్యుల నివారణలో ఔషధ ఫలంగా వాడుతున్నారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఉడికించి తింటారు. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు దీనిలో ఔషధవిలువలు మరింత ఎక్కువని చెబుతారు.

* వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు వస్తాయి. ఆపిల్ ( 56 ), జామ ( 49 ), మామిడి ( 70 ), బొప్పాయి ( 32 ) ... వంటి పండ్లతో పోలిస్తే ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి తక్కువ బరువుతో బాధపడేవాళ్లు ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శక్తిమంతంగా అనిపిస్తుంది.

* వీటిలో అధికంగా ఉండే విటమిన్ - సి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కణజాల బలహీనతని, ఆస్తమాను తగ్గిస్తుందట.

* ఈ పండులో ఉండే ఆల్కలాయిడ్లూ ఎసిటోజెనిన్‌లు క్యాన్సర్ సంబంధిత, మూత్రపిండాల వ్యాధులు రాకుండా కాపాడతాయి.

* వీటిలోని పీచు కాలేయ,పేగు వ్యాధుల నుంచి కాపాడుతుంది. జీర్ణక్రియకి ఎంతో మంచిది. సీతాఫలాల్లో అధికంగా ఉండే బి - విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్, చికాకూ వంటివి తగ్గుతాయి.

* ఈ పండ్లలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.

* వీటిలోని రిబోఫ్లేవిన్, విటమిన్ - 'సి' కంటిచూపుని మెరుగుపరుస్తాయి. ఇవి గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి.

* మెగ్నీషియం, కాల్షియం ఎముకల పుష్టిని పెంచుతాయి. ఆర్థ్రయిటిస్‌ను తగ్గిస్తాయి. పొటాషియం బిపిని తగ్గిస్తుంది.

* ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు తోడ్పడుతుంది.

* అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్బిణులకు కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది.

* అవకాడో, జామ, బొప్పాయిల్లో ఎక్కువగా ఉండే ఫొలేట్ ( బి-9 ) విటమిన్ సీతాఫలంలోనూ ఎక్కువే. అందుకే గర్భిణులకు ఈ పండు ఎంతో మంచిది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్ని తగ్గిస్తుంది.

* ఇందులోని ఎసిటోజెనిన్ రసాయనాలు చర్మ క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి. ఈ పండ్లు దొరికినన్నాళ్లూ రోజూ తినడం వలన శరీరం ముడుతలు పడకుండా ఉండటంతోబాటు కాంతివంతంగా మెరుస్తుంది.

* ముఖ్యంగా మన ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు కావలి, అవి పొందాలంటే సీజన్ ఫలాలను తప్పక తినాలి. ఎవరైతే సీజనల్ ఫ్రూట్స్ వదలకుండా తింటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుంది.

English summary
In order to maintain a healthy life one needs to eat seasonal fruits. One such seasonal fruit is Custard apple.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X