వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రహా అనుకూలతలకు ( ఏ ) దీపారాధన చేయాలి.

గోచార గ్రహాస్థాన దోషాలను నివారించి వాటిని శాంతింప జేయుటకు ఈ క్రింద తెలిపిన విధంగా దీపారాధన చేయడం వలన గ్రహానుకూలతలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. వ్యక్తి జాతకలలో నవగ్రహ సంచారాలను అనుసరించి శుభ ,

|
Google Oneindia TeluguNews

గోచార గ్రహాస్థాన దోషాలను నివారించి వాటిని శాంతింప జేయుటకు ఈ క్రింద తెలిపిన విధంగా దీపారాధన చేయడం వలన గ్రహానుకూలతలు కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.

వ్యక్తి జాతకలలో నవగ్రహ సంచారాలను అనుసరించి శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీపప్రజ్వలన అనకూడదు. దీపారాధన అనడంలోనే ఒక ప్రమార్ధం ఉంది.
దీపాన్ని వెలిగించండని శాస్త్రం , పూర్వీకులు చెప్పలేదు , దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు . విశ్వమంతా ఆత్మజ్యోతి ప్రకాశంచే నిండి ఉన్నది , మనం దీపం ( బాహ్యంగా ) బయట వెలిగించడమే కాదు మనలోన నిరంతరం వెలిగే ఆత్మజ్యోతి గురించి కూడా తెలుసుకోగలగాలి. అప్పుడే దేహాత్మ , జీవాత్మ , పరమాత్మ అనే దాని ఆంతర్యం అర్ధమవుతుంది.

దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం.
తమసోమా జ్యోతిర్గమయా...అన్నారు. తమస్ అంటే చీకటి.
ఓ పరమాత్మా...
అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుతురువైపు తీసుకోనివెళ్ళుమని అర్ధం . మనం
దీపారాధన చేయడం వలన మనకు అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానమనే వెలుతురు ప్రసరిస్తుంది .
ఎన్నో ప్రయోజనాలను వెలిగించే దీపారాధన మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

Deeparadhana for Graha Anukulatha

సౌజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యొజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే.

శ్రేష్ఠమైన ఆవునెయ్యి ( నువ్వుల నూనే) తో మూడు వత్తులను , మనసా, వాచ,కర్మన అనే భావనగా భావించి, పరమాత్మున్నితో విన్నవించుకోవాలి దేవా నాలోని గాడాంధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతిత్రయాన్ని వెలిగించాను సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్య జ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి కలిభాదల నుండి కాపాడి రక్షించు అని భావన.

నిత్య దీపారాధనకు శ్రేష్టమైన నువ్వుల నూనె వాడాలి.
ప్రతి దీపం( ప్రమిద)లో మూడు వత్తులను ఉపయోసించాలి.

గణపతికి కొబ్బరి నూనెతో ,

లక్ష్మీదేవి ఆవునెయ్యితో ,

అందరి దేవుళ్లకు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.

దీపాలను తప్పక కుంకుమ బొట్టు పెట్టాలి.

దీపాలను భూమిపై పెట్టరాదు, దీపం క్రింద బియ్యం లేదా, తమలపాకులు ,అరటిఆకుకానిలేదా ఏదేని ప్లేట్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి.

దీపాలు వెలిగించుటకు ఇత్తడివి, వెండివి, మట్టివి, బియ్యం పిండితో చేసిన వాటితోనే శ్రేష్టం

.

కేవలం నవగ్రహ
దేవతల పూజ కొరకు గోచార గ్రహ అనుకూలతలకు వారిని ప్రసన్నం చేసుకోవడం కొరకు చేసే ప్రత్యేకమైన పూజలో దీపారాధనకు ఏ రకమైన వత్తులు ,ఉపయోగించి
ఏ నూనేతో దీపారాధన చేయాలో తెలుసుకుందాం.

రవి గ్రహా ఆరాధనలో దూదిలో కుంకుమ కలిపి ఎర్రని వత్తిని చేసి ఏకవత్తిని బియ్యం పిండిలో కుంకుమ కలిపిన ప్రమిదను తయ్యారు చేసి వెలిగించి పూజచేయాలి. దీపారాధనలో ఆవునేతిని ఉపయోగించాలి.

చంద్ర గ్రహనికి సంభందించిన పూజలో వాడికిన దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను వెండి ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనలో నేతిని వాడాలి.

కుజ గ్రహ పూజలో కుంకుమ రంగు వర్ణంలో ఉన్న మూడు వత్తులను ఎర్రటి ప్రమిదలలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనెను వాడాలి.

బుధ గ్రహ పూజలో తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదలో తమలపాకు వేసి వెలిగించాలి. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.

గురుగ్రహా పూజచేయటానికి తామర వత్తులతో తయారు కాబడిన ఐదు వత్తులను కంచు ప్రమిదెలలో వేసి వెలిగించాలి. దీపారాధనలో నేయిని ఉపయోగించాలి.

శుక్ర గ్రహ పూజలో కూడా తామర వత్తులతో తయారు చేసిన ఆరు వత్తులను వేసి వెలిగించాలి. దీపారాధనకు ఆవునేతిని వినియోగించాలి.

శని గ్రహ పూజకు నల్లని ఏడు వత్తులను స్టీలు ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వినియోగించాలి.

రాహు గ్రహ పూజకు నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో రాహు కాలసమయంలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనెను వినియోగించాలి.

కేతు గ్రహ పూజలో తెల్ల జిల్లేడుతో తయారు కాబడిన తొమ్మిది వత్తులను ఉపయోగించాలి. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించాలి.

ఈ విధంగా మనకు ఏ గ్రహం అనుకూలంగా లేదో దానికి పై తెలిపిన విధంగా భక్తి శ్రద్దలతో దీపారాధన చేసినచో ఆయా గ్రహాలు శాంతి చెంది అనుకూల శుభఫలితాలు ఇస్తాయి. గోచార పరంగా దైవం కొరకు దీపారాధన చేయడం ద్వారా మానవులకు కష్టాలు తీరి సుఖ సంతోషాలతో జీవిస్తారని వేద , పురాణ గ్రంధాలు తెలుపుతున్నాయి.

జై శ్రీమన్నారాయణ

Dr.M.N.Charya

English summary
Deeparadhana for Graha Anukulatha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X