నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టే హనుమంతుడి అయిదు మంత్రాక్షరాలు
హిందువుల ఇష్టదైవం ఆంజనేయుడు. కోట్లాదిమంది హిందువులు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చని నమ్ముతారు. ఈ రెండు రోజుల్లో బజరంగబలిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వసిస్తారు.
మంగళ, శనివారాల్లో హనుమంతుని ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలీసాను పఠిస్తూ భక్తి శ్రద్ధలతో ఆంజనేయస్వామివారిని కొలుస్తుంటారు భక్తులు. భయాలు తొలగిపోవడానికి, నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి ఆంజనీపుత్రుడి మంత్రాలను జపిస్తారు.

దేవాలయానికి వెళ్లలేని వారు ఇంట్లో ఉండి ఈ మంత్రాలను పఠించవచ్చు. హనుమంతుడికి చెందిన కొన్ని మంత్రాలను జపిస్తే ప్రతికూల శక్తులు దూరమౌతాయి. అన్ని భయాలు తొలగిపోతాయి. దోషాల నుంచి విముక్తులు అవుతారు. ఆంజనేయ స్వామి శక్తివంతమైన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భయాన్ని పోగొట్టే 5 శక్తివంతమైన మంత్రాలు:
1. ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలబదనాయ: ఈ ఒక్క మంత్రం అన్ని రకాల భయాలను పోగొడుతుంది. మంగళవారం నాడు ఈ మంత్రాన్ని జపిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ప్రతికూల శక్తులను కూడా తొలగించగల సామర్థ్యం ఈ మంత్రాక్షరాలకు ఉంది.
2. నారసింహాయ ఓం హాం హీం హూం హౌం హః సకలభీతప్రేతదమనాయ స్వాహా: హనుమంతుని ఈ మంత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మంగళ, శనివారాల్లో ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ మంత్రోచ్ఛారణ చేసే వాళ్లు పాజిటివ్ ఎనర్జీని పొందగలరు. విజయాలను అందుకోగలరు.
3. ఓం అంజనీసుతాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి। తన్నో మారుతి: ప్రచోదయాత్: ఇది హనుమాన్ గాయత్రీ మంత్రం. దీనిని ప్రతిరోజూ జపించవచ్చు. మంగళవారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఎవరైతే నిజమైన భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తారో, వారిలో ఎప్పటికీ భయం ఉండదు. అంతేకాకుండా ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసం కూడా రోజురోజుకు పెరుగుతుంది.
4. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా: ప్రతికూల శక్తిని క్షణాల్లో మాయం చేసే బజరంగబలికి చెందిన ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం జపించడం వల్ల అనేక రకాల రోగాలు నయం అవుతాయి.
5. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హాం ఫట్: ఆంజనేయ స్వామివారి ఈ మంత్రం కూడా అన్ని రకాల భయాలను దూరం చేస్తుంది. ఈ మంత్రోచ్ఛారణ వల్ల శరీరం ఉత్తేజితమౌతుంది. పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వవు ఈ అయిదు మంత్రాలు.
Disclaimer: హనుమంతుడి శక్తిమంతమైన మంత్రాల గురించి పాఠకులకు తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. వీటి గురించి మరింత తెలుసుకోవాలనుకునే భక్తులు పండితులు, అర్చకులను సంప్రదించాలి.












Click it and Unblock the Notifications