• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉదయాన కడుపు నిండా భోజనం చేస్తేనే మంచి ఆరోగ్యం

|

మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం కావలంటే ఉదయం అల్పాహారం (టిఫిన్) మానేసి కడుపు నిండా భోజనం చేయాలి అదే మనకు ఆరోగ్యసూత్రం.ఎందుకంటే రాత్రి సమయం ఎక్కువ సేపు మనం నిద్రలో ఉంటాము.ఉదయానికి కడుపులోని ఆహార పదార్ధాలు జీర్ణమైపోతాయి కాబట్టి ఉదయం 8 గంటల నుండి 9 గంటలలోపు ఎక్కువ మోతాదులో అన్నం తినాలి.సమయంలేదని ఆలస్యం చేస్తే కడుపులో ఉండే ఆమ్లాలాలు అనారోగ్య ప్రభావం వైపు దారి తీస్తాయి.

దాని వల్లనే మానవ శరీర తత్వాలను బట్టి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది.ప్రతి రోజు సమయానికి భోజనం చేసే అలవాటు చేసుకోవాలి.ఉదయం అల్పాహారం తినే అలవాటు భారతీయులదికాదు,అది ఆంగ్లేయులది.వారి దేశవాతవరణం దృష్ట్యా వారు ఉదయం అల్పాహారమే మంచిది.ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వారికి సంవత్సరంలో 7 , 8 నెలల పాటు సూర్యోదయమే ఉండదు.

Eat until your stomach is full in the morning

మానవ శరీరంలోని జఠరాగ్నికి సూటిగా సూర్యునితో సంబంధం ఉంది.సూర్యుడు ఉదయించేటప్పుడు జఠరాగ్ని తేజోవంతంగా పనుచేస్తుంది.సూర్యుడు అస్తమించే సమయానికి జఠరాగ్నిప్రభావం కూడా తగ్గతూ ఉంటుంది.యూరప్,అమెరికా లాంటి చోట్ల ఎక్కువ కాలం మంచు కురుస్తూ ఉంటుంది.

సూర్యోదయమే అవ్వదు.కనుకనే వారి జఠరాగ్ని తక్కువగా ఉండటం కారణంగా వారు ఉదయం ఆహారం ఎక్కువగా తీసుకోలేరు.కాదని ఎక్కువ ఆహారం ఉదయం తీసుకుంటే వారికి ఎన్నో సమస్యలు వస్తాయి.కనుక ఎవరైనా సరే వారు ఉన్న ప్రదేశాన్ని బట్టి అక్కడున్న వాతావరణ స్ధితులను బట్టి అక్కడి నియమాలనే అనుసరించాల్సి వస్తుంది.

రాత్రి త్వరగా పడుకునే వారు సాయంకాలం భోజనం సూర్యాస్తమయానికి 40 నిముషాల ముందుగా భోజనం చేయ్యాలి.అంటే మన ప్రాంతంలో 6 గం.లకు సూర్యాస్తమయం అయ్యేటట్లయితే అప్పుడు మనం 5 గంటల 20 నిమిషాల సమయంలో ఆహారం తీసుకుని ముగించాలి.కొంత మంది రాత్రి ఆలస్యంగా పడుకునే వారు రాత్రి 8 గంటల వరకు తెలికపాటి భోజనం చేయాలి.

రాత్రి పూట ఏదైన తీసుకోవాలనిపిస్తే అది కేవలం పాలు లేదా లిక్వీడ్ పదార్ధాలు మాత్రమే ఉత్థమమైన ఆహారం.

డయాబెటిస్,ఆస్తమా మరుయు వాత సమస్యలు ఉన్న ఎవరైన పీచు పదార్ధాలు,దంపుడు బియ్యం,తృణధాన్యపు మొలకలు,కాకరకాయ,క్యారేట్,ఆకుకూరలు,జొన్న,రాగి జావ,రొట్టేలు,మజ్జిగ,నెయ్యి,వెన్న మొదలగు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా ఆహార నియమాన్ని పాటించినచో రోగాల నుండి విముక్తులు అవుతారు.

మన దేహం సంపూర్ణ ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఉదయం 8:30 లోపు పుష్టిగా భోజనం చేయాలి.మధ్యాహ్నం ఒంటిగంట నుండి 2 గంటల లోపు కొంచం తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి.సాయంత్రం 4 నుండి 5 గంటల మధ్యలో పండ్ల జ్యూస్ లేదా మజ్జిగ,రాగిజావ మొదలగు ద్రవ పదార్ధాలు తీసుకోవాలి.రాత్రి 8 గంటల లోపు తేలికపాటి ఆహరం తీసుకొవాలి.తినే సమయంలో మౌనంగా ఉండటం ఉత్తమం,టివి చూస్తూ తినకూడదు.తిన్నవెంటనే పడుకోవద్దు,కాస్త అటు ఇటు తిరగాలి.

భోజనం అనేది ఎలా చేయాలంటే ఉదయం సేవకుడిలాగా 'ఏక్కువగా' తినాలి.మధ్యాహ్నం మహారాజులాగ 'మధ్యస్తంగ" భుజించాలి.రాత్రి సమయంలో మహారాణిలాగ 'తేలికై" ఆహారం తీసుకోవాలి ఈ సూత్రప్రకారం వ్యవహరిస్తే చాలా మంచిది.ఉదయం పరిగడుపున ఒక రాగి చెంబు నిండ నీళ్ళు నిధానంగా కూర్చోని త్రాగాలి.చాయి తాగే అలవాటు ఉన్న వారు తాగే ముందు ఒక గ్లాస్ నీళ్ళు త్రాగి 'టి' త్రాగాలి.రోజుకు రెండు,మూడు కంటే ఎక్కువ చాయలు తాగ కూడదు.

ముఖ్యంగా ఆహారానికి అరగంట ముందు,తర్వత నీళ్ళను తాగకూడదు.అత్యవసరమైతే ఒక గుటికేడు మాత్రమే త్రాగాలి.భోజనం మాత్రం భూమి మీద చాప వేసుకుని స్పూన్ వాడకుండా చేతితో తింటే చాలా మంచిది.ఫంక్షన్లలో భోజనాం చేయవలసి వస్తే ఆక్కడ ప్లాస్టీక్ విస్తర్లు,గ్లాసులను మీరే స్వయంగా శుభ్రంగా కడుక్కుని తినాలి.డైరేక్ట్ గా తింటే ఆరోగ్యానికి హానికరం.సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులలో ఏ ఆహాయర పదార్ధాలు తిన్నా మనం దానితో పాటు కొంత విషం తీసుకున్నట్టే అవుతుంది ఇది గమనించండి.ఈ నియమాలను ఎవరు పాటింస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది.

-డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" ,

ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,

ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whether you're waking up first thing in the morning or haven't eaten in hours after a long day, here are some of the best and worst foods for an empty stomach
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more