ధనత్రయోదశి నాడు బంగారం కొనకున్నా ఈ పనులతో అష్టైశ్వర్యాలు!!
దీపావళి పండుగకు ముందు హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే మరొక పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినం తోనే ప్రారంభిస్తారు. ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిగా భావించి ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. ధన త్రయోదశి లక్ష్మీ దేవికి ఇష్టమైన రోజని, కుబేరుడి రోజని చెప్తారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఇక ధన త్రయోదశి రోజు చాలామంది బంగారం, వెండి, వాహనాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒక గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు.

అయితే ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బంగారాన్ని కొనుగోలు చేయడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒకింత ఇబ్బందికరంగానే మారింది. అయితే ధన త్రయోదశినాడు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే కొన్ని వస్తువులను దానం చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసినంత పుణ్య ఫలాలు వస్తాయని చెబుతున్నారు.
ధన త్రయోదశి పర్వదినం నాడు పాలు పెరుగు తేనె వెన్న దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అంతేకాదు ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు, కాళ్లకు చెప్పులు, గొడుగు దానం చేస్తే అఖండమైన సంపదలు వస్తాయని చెబుతున్నారు . భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలంటే, దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలంటే ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ, మంచాన్ని కానీ దానం చేస్తే మంచిదని చెబుతున్నారు.
ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విడిపోరని అంటున్నారు. సువర్ణ దానం, వస్త్ర దానం, శయ్యా దానం, వస్తు దానం, పదార్థాల దానం ఇలా ఐదు రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవి దానాలతో సంతోషిస్తుందని, దానాలు చేసిన వారిపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని అంటున్నారు. ధన త్రయోదశి రోజు ఉన్న దానిలో కొద్దో గొప్పో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications