ఇంట్లో నంది విగ్రహాన్ని పెట్టడం వల్ల దోషాలు కలుగుతాయా?
హిందూ మతంలో నంది, గోవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గోమాతను సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావిస్తారు.. నిత్య పూజలు చేస్తారు. గోవులకు ఆహారం వేయడం, వాటిని పోషించడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని, ధనవృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. గోదానం చేయడం వల్లా అనేక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
అలాగే- నందికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మైథాలజీ ప్రకారం.. నంది పరమశివుడి వాహనం. శివాలయానికి వెళ్లినప్పుడు తొలుత నందిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. నంది చెవిలో ఏదైనా చెబితే అది ఆ నీలకంఠుడికి చెప్పినట్టే అవుతుందని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తుంటారు.

సాధారణ ఎద్దు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం మంచిది కాదు. నంది మాత్రం ఆ పరమేశ్వరుడి వాహనం. కాబట్టి నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శుభప్రదమని నమ్ముతారు. శివలింగం ఉన్న ఇంట్లో నంది విగ్రహాన్ని శివలింగానికి దగ్గరగా ఉంచాలి. పురాణాల ప్రకారం- భక్తులు తమ కోరికను నంది చెవిలో చెబితే, అది తప్పకుండా శివుడికి చేరుతుంది.
వాస్తు ప్రకారం నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. నంది విగ్రహాన్ని తమ ఆఫీసులు, షాపులు.. ఇతరత్రా ప్రదేశాల్లో నైరుతి దిశలో ప్రతిష్టిస్తే ఆదాయం పెరుగుతుందని, వ్యాపారం వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో వచ్చే ఆకస్మిక సమస్యలు, నష్టాల గురించి నుంచి నంది రక్షిస్తాడు.
అంతే కాకుండా వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంట్లో శివలింగంతో పాటు పార్వతి దేవి, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, నంది విగ్రహాలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో దేవుడి మందిరంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి.
నంది మీద ఆసీనుడైన లేదా ధ్యాన ముద్రలో ఉన్న ఆ పరమేశ్వరుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలహాలు కుటుంబ మటుమాయమౌతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. పిల్లల ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతుంది. దీనితో పాటు అన్ని రకాల బాధలు, రోగాల నుండి విముక్తి లభిస్తుంది.
నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శివుడు సంతోషిస్తాడని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలి. నంది విగ్రహానికి ప్రతిరోజూ పూజలు చేయాలి. శివలింగానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో.. నంది విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ పూజలు చేస్తుండాలి.
Disclaimer: ఈ సమాచారం నమ్మకాలు, మత గ్రంథాల విశ్వాసాన్ని తెలియజేయడానికి ఉద్దేశించినది. నంది విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం, వాటికి పూజలు చేయాల్సిన విధి విధానాల గురించి మరింత సమాచారాన్ని పండితులను అడిగి తెలుసుకోవాలి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications