మే 12న బుద్ధ పౌర్ణమి రోజు 2 అరుదైన యోగాలు.. ఈ రాశులకు అఖండ సంపద
వచ్చే నెల 12వ తేదీన బుద్ధ పౌర్ణమి వస్తోంది. బౌద్ధ మతాన్ని అనుసరించేవారికి ఇది ఎంతో కీలకమైన పర్వదినం లాంటిది. ఈ సమయంలోనే గజకేసరి యోగం, అక్షయ యోగం ఏర్పడుతున్నాయి. గ్రహాల సంచారం జరగబోతోంది. చంద్రుడు, గురుడు కలయిక ఉంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి అత్యంత ధనయోగం కలుగుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అపారమైన ధనలాభం ఉన్న ఆ రాశులవారు ఎవరు? వారికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఉద్యోగంలో పదోన్నతి ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వీరికి విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు.

ధనస్సు రాశి
ఆధ్యాత్మికతవైపు ఆసక్తి చూపిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సమాజసేవలో పాల్గొని సమాజంలో కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.
వృశ్చిక రాశి
రెండు రాజయోగాల ప్రభావంతో వీరికి స్థిరాస్తి పరంగా లాభాలున్నాయి. గతంలో చేసిన రుణాల నుంచి బయటపడతారు. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు.
మకర రాశి
ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వేతనాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరి సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు ఈ సమయంలో పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా ఉంటారు.
వృషభ రాశి
ప్రేమ వ్యవహారంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా బాగా కలిసివస్తుంది. అనేక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఏ పనికైనా అదృష్టం తోడుండటంవల్ల చాలా సులువుగా పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications