రాహు-కేతు గమనం... ఈ రాశులకు అష్టైశ్వర్యాలు

జ్యోతిష్యం ప్రకారం రాహువు, కేతువు నీడ గ్రహాలు. ఇవి పాప గ్రహాలని, అన్నీ చెడే చేస్తాయని భావిస్తుంటారు. కానీ ఇవి మంచి చేస్తే ఆ ఫలితాలు పొందినవారికి తిరుగుండదు. వచ్చే నెలలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటున్నాయి. మే 18వ తేదీన రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాయి. ఇవి రాశుల్లో 18 నెలలు సంచరిస్తాయి. 18 నెలల తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. ఈ రెండు గ్రహాల రాశి మార్పువల్ల కొన్ని రాశులవారు విశేష ప్రయోజనాలు పొంది ఆర్థికంగా లాభపడుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి
సంపద పెరగడంతోపాటు కుటుంబంలో వాతావరణం కూడా చాలా అనుకూలంగా మారుతుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అప్పులన్నీ తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని ఉపయోగించుకుంటే డబ్బులు వరదలా వస్తాయి.

five zodiac signs will get all wealth and benefits due to rahu and ketu transit from may 18th

ధనుస్సు రాశి
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సమస్యలన్నింటినీ అధిగమిస్తారు. ఎటువంటి సవాల్ నైనా స్వీకరిస్తారు. ధనం రావడానికి అనేక ఆదాయ మార్గాలు దొరుకుతాయి.

మకర రాశి
సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. పెట్టే పెట్టుబడులను చాలా ఆలోచించి పెడతారు. అవి భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. డబ్బులు గతంలోకంటే పెరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు.

మేష రాశి
సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాంపత్య జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. జీవితంలో ఇప్పటివరకు మీ అభివృద్ధికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలున్నాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి.

మిథున రాశి
కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం తలుపు తడుతుంది. ప్రతి పనిలోను విజయం వెంటే ఉంటుంది. ప్రేమ జీవితంలో ఇబ్బందులేమీ లేవు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+