ఈ రోజు నుంచి ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాలకు రాకుమారుడైన బుధుడు తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. నిరంతరం రాశి సంచారం చేసే బుధుడు అక్టోబరు 3వ తేదీన తన సొంత రాశి కన్యారాశిని వదిలిపెట్టి తులారాశిలోకి సంచారం చేశాడు. 23వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. దీనివల్ల ఐదు రాశులవారికి మంచిరోజులు ప్రారంభమయ్యాయి. ఏయే రాశులకు ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యా రాశి
కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి స్థానంలో ఉంటారు. ఉద్యోగాలకు సంబంధించి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

తులా రాశి
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మీపై మీకు నమ్మకం కలిగి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు ఉన్నాయి.
కర్కాటక రాశి
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శాంతి నెలకుంటుంది. ఉద్యోగస్థుల కెరీర్ బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉండే సమయం ఇది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. జీవితంలో వృద్ధిలోకి వస్తారు.
వృశ్చిక రాశి
అదనంగా డబ్బులు సంపాదించేందుకు మార్గాలు దొరుకుతాయి. వ్యాపారస్తులు మంచి విజయాన్ని నమోదు చేస్తారు. వారికి భారీగా లాభాలున్నాయి. మానసికంగా ఒత్తిడి నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది.
కుంభ రాశి
మీ కష్టంతో అనుకున్న పనిని పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవసరాలకు తగినట్లుగా మీకు అవసరమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో పూర్తికాని పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.












Click it and Unblock the Notifications