ఈ నెల 15 నుంచి ఈ రాశులకు బంకలా పట్టుకుంటున్న అదృష్టం
నవగ్రహాల్లో కీలకమైన గ్రహం బృహస్పతి. ఆయన దేవతలకు గురువు. ఈనెల 15వ తేదీన గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి బృహస్పతి అదే రాశిలో సంచారం చేస్తుంటాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగి గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన రాజయోగం అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్యారాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో చాలా సులువుగా పూర్తవుతాయి. డబ్బులు కూడా భారీ మొత్తంలో సంపాదిస్తారు. సంపాదించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వాటిపై మంచి రాబడి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి.

కుంభరాశి
ఈ రాశివారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరంలేదు. బాగుంటుంది. పెద్దల నుంచి, భార్యవైపు నుంచికానీ ఆస్తులు కలిసివస్తాయి. దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు.
వృషభ రాశి
గురు ఆదిత్య రాజయోగం ఈ రాశివారికి విశేషమైన ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. ఇతర ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి. వీరికి పనితీరుతో మంచిపేరు లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది.
మీన రాశి
ఈ రాశివారు మంచి శుభవార్తలను వింటారు. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసివస్తుంది. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభార్జన ఉంది. అన్ని వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. సమాజంలో మంచిపేరు లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఈ రాశివారు పూర్తిగా బయటపడతారు.
సింహరాశి
ఈ రాశివారికి అద్భుత పురోగతి ఉంది. సంపాదన భారీగా పెరుగుతుంది. అదృష్టం కలిసివచ్చు అన్ని పనులు పూర్తవుతాయి. కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications