2025లో ఈ రాశులు ముఖేష్ అంబానీకే అప్పులిచ్చేంతస్థాయికి ఎదుగుతారు
విలసవంతమైన జీవితానికి, సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీక శుక్రుడు. ఆయన దయ ఉంటే అపారమైన ధనం వద్దన్నా కలిసివస్తుంది. కుబేరులవుతారు. ఒకరకంగా చెప్పాలంటే ముకేష్ అంబానీకే అప్పు ఇచ్చే స్థాయికి కొన్ని రాశులవారు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాయి. ఇలా మారే క్రమంలో కొన్ని యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఆ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చాలా బాగా కలిసివస్తుంది. ఉన్న అప్పులను కూడా తీర్చేస్తారు. ఈనెల 28వ తేదీన రాశిని మార్చే కుజుడు నెలరోజులపాటు కుంభరాశిలోనే ఉంటాడు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసివస్తాయో తెలుసుకుందాం.
కుంభ రాశి
నెలరోజుల్లో వీరు ఆర్థికంగా మంచి అవకాశాలను పట్టుకుంటున్నారు. వీరు చేపట్టే ప్రతి పనిలోను విజయం కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నవారికి ఈ సమయంలో కోరిక నెరవేరుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. అయితే వచ్చిన డబ్బును పొదుపు చేయడంపై భవిష్యత్తు ఆధారపడివుంటుంది.

తులారాశి
కొత్త సంవత్సరంలో జనవరి నెల వీరికి బాగా కలిసిరావడంతోపాటు సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్లివస్తారు. ఉద్యోగస్తులకు వారు పనిచేస్తున్న ప్రదేశంలో కూడా మంచిపేరును సంపాదించుకుంటారు.
మేషరాశి
ఎప్పటినుంచో వేధిస్తున్న కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాలు చక్కబడతాయి. తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. పెళ్లికానివారికి ఈ సమయంలో పెళ్లి కుదురుతుంది. శుక్రుడి సంచారం వీరికి బాగా కలిసివస్తుంది.
మకర రాశి
పని చేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. కొత్త ఇంటిని లేదంటే కొత్త కారును కొనుగోలు చేస్తారు. అప్పుల బాధ నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి కటాక్షిస్తుంది.












Click it and Unblock the Notifications