మా నాన్నే నాడు దేవుడు - అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా లేటెస్ట్ గా అల్లు అర్జున్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఉద్దేశించి చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

ఏం జరిగిందంటే..
కాగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తండ్రితో ఉన్న మధుర క్షణాల వీడియోను పంచుకున్నారు. "మా నాన్నే నాకు దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నాకు ఈ జీవితంలో దాదాపు అన్నీ ఇచ్చింది ఆయనే. మా నాన్నకు, ప్రపంచంలోని ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు" అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ కి సైతం అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు రాకా సినిమాతో పాటు అల్లు అర్జున్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత 'పుష్ప' ఫ్రాంచైజీలోని మూడో భాగంలో కూడా పుష్పరాజ్‌గా ఆయన సందడి చేయనున్నారని సమాచారం.
My father is my God . He is the only God I can see, hear, speak to, touch & the one who has given me almost everything in life.
— Allu Arjun (@alluarjun) June 21, 2026
Happy Father’s Day to my dad and to every sweet dad in the world. 🖤#FathersDay pic.twitter.com/j5GgkUi8eU












Click it and Unblock the Notifications