శని వక్రగతితో 4 రాశులకు తిరుగులేదు.. రాసిపెట్టుకోండి

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పునకు సమయం ఆసన్నమైంది. కర్మఫలదాత అయిన శని దేవుడు జూలై 27వ తేదీన వక్రగతి లోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు 138 రోజుల పాటు శని ఇదే స్థితిలో కొనసాగుతాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని గమనం మారడం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిన పీడ వదిలిపోవడమే కాకుండా, ఊహించని రీతిలో అదృష్టం వరించబోతోంది. గతంలో ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ వారికి ఈ 138 రోజులు ఒక వరంలా మారబోతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థికంగా జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి.

మేష రాశి
మేష రాశిలో జన్మించిన వారికి శని వక్ర దశ కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు లభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా అనుకుంటున్న వారి కలలు ఈ సమయంలో సాకారమవుతాయి. సహోద్యోగుల మద్దతుతో పాటు, కుటుంబంలో నెలకొన్న అశాంతి, మానసిక సమస్యలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది.

astrology With Saturn turning retrograde four zodiac signs are set for unstoppable success mark my words

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ 138 రోజుల సమయం రాజయోగంలా మారబోతోంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. బాస్ అండదండలతో పాటు అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. పని బాధ్యతలు పెరిగినప్పటికీ, సహోద్యోగులతో ఆనందంగా గడుపుతూ కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు.

కుంభ రాశి
శని వక్రగతి వల్ల కుంభ రాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు వృత్తి జీవితంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అశాంతి తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మీన రాశి
జూలై నెల నుంచి మీన రాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. శని ప్రభావం వీరికి అన్ని రంగాల్లోనూ సానుకూలంగా మారనుంది. మానసిక దృఢత్వం పెరిగి, అనుకున్న పనులను పట్టుదలతో సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఉత్తీర్ణత సాధిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడి, వ్యాపారాల్లో భారీ లాభాలు చూస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+