రెండు రాజయోగాలు... ఈ రాశులకు అఖండ ధనయోగం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. అతి తక్కువ సమయంలో సూర్యుడు, అతి ఎక్కువ సమయంలో శనిదేవుడు ప్రవేశిస్తారు. సూర్యుడు రాశి మార్పునకు 30 రోజుల సమయం తీసుకుంటే, శనిదేవుడు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు.
ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అక్కడ బుధుడు ఉండటంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. శుక్రుడు కూడా అదే రాశిలో సంచారం చేస్తుండటంతో శుక్రాదిత్య యోగం సంభవించింది. వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ రెండు రాజయోగాలు ఉంటాయి. వీటివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

వృషభ రాశి
వ్యాపారస్తులకు, ఉద్యోగస్థులకు ఆర్థిక విషయాల్లో అదృష్టం తోడుంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా పరిణామాలు సంభవిస్తాయి. ఇక రాదు అనుకున్న సొమ్ము చేతికి వస్తుంది. డబ్బు విషయాల్లో అదృష్టం ఎక్కువగా కనపడుతోంది. కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు.
తులా రాశి
న్యాయ సంబంధిత విషయాల్లో పరిస్థితులన్నీ ఈ రాశివారికి అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకుంటుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం ఉంది. అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
కుంభ రాశి
జీవితం సంతోషంగా గడుపుతారు. మీ మనసుకు నచ్చిన పనులే చేస్తారు. ఉల్లాసంగా ఉంటార. వీరికి మంచి సమయం వచ్చింది. అన్ని విషయాల్లో అదృష్టం కలిసివచ్చు డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుపుతారు. డబ్బుకు సంబంధించి లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
ధనస్సు రాశి
శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య రాజయోగంవల్ల వీరికి సమాజంలో హోదా పెరుగుతుంది. దాంతోపాటు గౌరవం కలుగుతుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. వ్యాపారాస్తులకు మంచి లాభాలున్నాయి. ఏ పని తలపెట్టినా విజయాన్ని అందుకుంటారు.












Click it and Unblock the Notifications