సంక్రాంతి ముగిసింది... ఈ రాశులకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు

మకర సంక్రాంతిని అందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ పండగ తర్వాత శనిదేవుడు వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీనివల్ల కొన్ని సంవత్సరాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్నవారి ఇక్కట్లన్నీ తొలగిపోయి అదృష్టం కలిసివస్తోంది. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శని మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే అంతకు రెట్టింపు చెడు ఫలితాలను ఇస్తాడు. న్యాయదేవత అయిన శనిదేవుడివల్ల ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తులా రాశి
చేస్తున్న పనిలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్థిరత్వాన్ని పొందుతారు. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉండటంతో ఆర్థికంగా బలపడతారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాశివారు అనుభవిస్తున్న కష్టాలన్నీ శనిదేవుడి దయవల్ల తొలగిపోనున్నాయి.

four zodiac signs will get financial benefits due to saturn enter in pisces

కుంభ రాశి
ఈ రాశివారికి మాత్రం మంచి యోగం పడుతుందని చెప్పొచ్చు. ఏడున్నర సంవత్సరాల శని అర్థాష్టమ కాలం తొలగిపోతోంది. మరో రెండున్నర సంవత్సరాలు వీరికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రతి శనివారం నవగ్రహాలకు అభిషేకం చేయడంతోపాటు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. దీనివల్ల పలు లాభాలను అందుకుంటారు.

కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. ఇక రాదు అనుకొని ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా మీరు బలవంతులవుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అనుకోకుండా లాభాలు వస్తాయి. వచ్చిన డబ్బును పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం ఆధారపడివుంది. ఆడంబరాలకు వెళితే నష్టపోతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మీన రాశి
ఉద్యోగులకు వేతనం పెరగడంతోపాటు కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. కష్టపడినవారికి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. అనుకోకుండా అదృష్టం కలిసివచ్చి ధనలాభం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+