వచ్చేనెల నుంచి ఈరాశివారు పట్టిందల్లా బంగారమే!
గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు వచ్చే నెల నుంచి నాలుగు రాశులవారి జాతకాన్ని మార్చనున్నాడు. మే నెల నుంచి ఈ రాశివారు పట్టిందల్లా బంగారమయ్యేలా చేయనున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ నాలుగు రాశులు ఏమిటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా చూస్తారు. అంతేకాదు.. ధైర్య సాహసాలకు కారకుడు అంగారకుడేనని భావిస్తారు. మే 20వ తేదీ మధ్యాహ్నం 2.13 గంటలకు కుజుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఆర్థిక అంశాల్లో మేలు జరగడమే కాకుండా వ్యాపారాల్లో లాభాలనిస్తాడు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.
వృషభ రాశి : ఉత్సాహం, ధైర్యం, శక్తి పెరుగుతాయి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంది. టోటల్ గా ఈ సమయం వృషభరాశివారికి బాగా కలిసిరానుంది.

కన్య రాశి : శ్రమకు తగిన ప్రతిఫలంతోపాటు వివిధ మార్గాలద్వారా వీరికి ఆదాయం సమకూరుతుంది. కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభం వస్తుంది.
కుంభ రాశి : మధ్యలో ఆగిపోయిన పనులన్నీ మళ్లీ మొదలవుతాయి. మీరు పనిచేసే కార్యాలయంలో ప్రశంసలు లభించడమే కాకుండా వేతనం పెరుగుదలతో పదోన్నతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి : క్రీడలతో సంబంధం ఉన్నవారు అవార్డులను, పతకాలను సాధిస్తారు. పోటీపరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగంతోపాటు వారి ప్రేమ కూడా విజయవంతమవుతుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.












Click it and Unblock the Notifications