ఉగాది నుండి ఈ 3రాశుల వారికి గజకేసరి రాజయోగం; వాళ్ళ పంట పండినట్టే!!
ఉగాది నుండి సింహ రాశి, మీనా రాశి, మిథున రాశుల వారికి గజకేసరి రాజయోగం ప్రారంభం అవుతుంది. దీంతో వాళ్ళ పంట పండినట్టే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
తెలుగువారు అత్యంత ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ మార్చి 22వ తేదీన వస్తుంది. అయితే ఈ పండుగ 12 రాశుల వారి జీవితాలలోనూ విభిన్నమైన మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఉగాది నుండి గజకేసరి రాజయోగ లభించనుందని, ఆ రాశుల వారికి తిరిగే లేదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

ఉగాది నుండి మూడు రాశుల వారికి గజకేసరి రాజయోగం
శోభకృత్ నామ సంవత్సర ఉగాది మార్చి 22వ తేదీ 2023న ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీనరాశిలో బృహస్పతి మరియు చంద్రుడి కలయిక గజకేసరి రాజయోగాన్ని కలిగిస్తుంది. మీనరాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బలంగా ఉంటుంది. డబ్బుకు ఏ విధమైన లోటు ఉండదు. గజకేసరి రాజయోగం వల్ల అతిపెద్ద సంక్షోభాల నుండి బయటపడటమే కాకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి రాజయోగం లభించిన రాశుల జాతకులు సమాజంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు.

గజకేసరి రాజయోగం అంటే ఇదే..
గజకేసరి రాజయోగం అంటే.. గజము అంటే ఏనుగు అని, కేసరి అంటే సింహము అని అర్థం. ఏనుగు సింహం రెండూ కూడా చాలా బలమైన జంతువులు కావడంతో, ఆయా జాతకులకు అన్ని విషయాలలోనూ గజకేసరి రాజయోగంతో బలం చేకూరుతుందని, వారు విశేషమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, ఏ పని చేసినా తిరుగులేని విషయాన్ని సాధిస్తారని చెబుతారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో గజకేసరి రాజయోగం అంటే అన్ని శుభాలని ఇచ్చే రాజయోగం .ఇక ఈ సంవత్సరం ఈ గజకేసరి రాజయోగం ఏ ఏ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఎవరి జాతకాలను తిరుగులేని విధంగా చేస్తుంది అంటే..

సింహరాశి
చైత్రమాసంలోని శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది రోజు మీనరాశిలో ఏర్పడనున్న గజకేసరి రాజయోగంతో సింహరాశి జాతకులకు తిరుగులేకుండా ఉంటుంది. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా ఎంతో ఫలవంతంగా ఉండబోతుంది. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. విభిన్న పరిశోధనలు చేసే వ్యక్తులు తమ పరిశోధనలను పూర్తి చేసి ప్రయోజనాలను పొందుతారు. గజకేసరి యోగంతో వారికి గొప్ప సంపద కూడా లభిస్తుంది.

మీనరాశి
గజకేసరి యోగంతో మీన రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మీనరాశిలోని లగ్న గృహంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది మీనరాశి జాతకుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతుంది. మీనరాశి జాతకులకు లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం. మీనరాశి జాతకులు ఏ పని చేసినా కూడా సమయం అనుకూలిస్తుంది, అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రచనలు మరియు చదువులతో సంబంధం ఉన్నవారు ఈ సంవత్సరం చాలా కీర్తి, ప్రతిష్టలను పొందుతారు. అంతేకాదు అన్నింటా విజయాన్ని సాధిస్తారు.

మిథునరాశి
గజకేసరి రాజయోగంతో మిధున రాశి జాతకులకు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ సంవత్సరం బృహస్పతి మీ రాశిలో ఉగాది నుండి ఆధిపత్యం చెలాయించే స్థానంలో ఉంటాడు. దీంతోపాటు గజకేసరి రాజయోగంతో కూడా మిధున రాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగాలు మరియు వృత్తులలో అనేక మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. వ్యక్తుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గజకేసరి రాజయోగంతో మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications