బృహస్పతి తిరోగమనంతో వీరింటికి నడిచొచ్చే లక్ష్మీదేవి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశులవారికి సానుకూల, ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. దేవగురువు బృహస్పతి 2024లో మే ప్రారంభం నుంచే వృషభ రాశిలోకి వచ్చాడు. వచ్చే ఏడాది మే 13 వరకు బృహస్పతి వృషభరాశిలోనే సంచరిస్తాడు. ఇక 2024 అక్టోబర్ నెలలో బృహస్పతి తిరోగమనం చేయనున్నాడు.
బృహస్పతి తిరోగమనం
బృహస్పతి వృషభరాశిలో అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు తిరోగమన దిశలో ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. 2025 ఫిబ్రవరి 4వరకు బృహస్పతి తిరోగమనములోనే సంచరిస్తాడు. అయితే బృహస్పతి తిరోగమనం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
బృహస్పతి తిరోగమనం వల్ల మిధునరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు చేసే ప్రతి పనిలోనూ సానుకూల ఫలితాలను పొందుతారు.ఆర్థికంగా బలోపేతం అవుతారు. సంపద పెరగడంతో పాటు ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు గొప్ప పురోగతిని సాధిస్తారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. గురు గ్రహ తిరోగమనం వల్ల మిధున రాశి వారు రోగాల బారి నుండి బయట పడతారు.
కన్యారాశి
బృహస్పతి తిరోగమనం కన్యారాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆదాయ వనరులు కనిపిస్తాయి. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కెరీర్ లో అఖండ విజయాలను సాధిస్తారు. పిల్లలనుండి శుభవార్తలు వింటారు .ఈ సమయంలో ఏ పని చేసిన కలిసొస్తుంది.
వృశ్చిక రాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా వృశ్చిక రాశి వారు సంపన్నులవుతారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరి అదృష్టానికి తిరుగు ఉండదు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి .న్యాయవివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి లభిస్తుంది. దీర్ఘకాలంగా తగ్గకుండా బాధిస్తున్న వ్యాధుల నుండి బయటపడతారు. నిజంగా ఇది వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications