లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే..
లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యానికి దేవతగా పూజిస్తారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మీకు దేనికీ లోటుండదనే విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు. రాత్రి 9.00 గంటల నుంచి 10.00 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించడంవల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. మొత్తం 12 రాశులు ఉండగా అందులో నాలుగు రాశులపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. ఆ రాశులవారు ఎవరెవరో తెలుసుకుందాం.
మీన రాశి: మీన రాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. వీరు అదృష్టవంతులు. ఇంట్లో ఆనందంతోపాటు ఐశ్వర్యం వెల్లివిరిస్తుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఎలాంటి పనినైనా సులభంగా పూర్తిచేస్తారు.

వృషభ రాశి: వృషభరాశి వారు తెలివైనవారు. వీరిది కష్టపడే తత్తవం. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసివస్తుండటంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబం సభ్యుల మధ్య అనుబంధంతోపాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు: ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. దీనివల్ల వీరు అపారమైన ఐశ్వర్యాన్ని పొందుతారు. చేపట్టే ప్రతి పనిలోను అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం వీరిపై ఎప్పుడూ ఉంటుంది.
కర్కాటక రాశి: వీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు వీరికి ఎప్పుడూ ఉంటాయి. జీవితంలో దేనికీ లోటుండదు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

దీపావళి, నవరాత్రుల సందర్భంగా లక్ష్మీదేవి పూజలు అందుకుంటారు. శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం. అనగా ఐశ్వర్యం, సంపదకు దేవత, మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. ఆ లక్ష్యాలే అష్టలక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత, లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్ష్యం పొందినట్లేనని భావన.












Click it and Unblock the Notifications