వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఈ పదార్ధాలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే!!

|
Google Oneindia TeluguNews

మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తీసుకోవడం అత్యంత హానికరమని సూచించబడింది. కొన్ని రకాల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే రక రకాల జబ్బుల బారిన పడతామని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆహారంలో వేటి వినియోగాన్ని పరిమితం చేయాలి అనే అంశాలను ప్రస్తుతం మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.. డేంజరస్ ఫుడ్స్ జోలికి పోకండి

ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.. డేంజరస్ ఫుడ్స్ జోలికి పోకండి

ఆహారం లో ఏది తినాలి ఏమి తినకూడదు అనేది తెలియకపోతే ఖచ్చితంగా మనం ప్రాణాలమీదికి తెచ్చుకున్నట్టే. చాలా ఆహారపదార్ధాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ మరియు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇక మనకు అనారోగ్యం కలిగించే కొన్ని ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకూ తగ్గించాలని సూచిస్తున్నారు.

చక్కెర ఎక్కువ వాడుతున్నారా? అయితే జాగ్రత్త

చక్కెర ఎక్కువ వాడుతున్నారా? అయితే జాగ్రత్త


నిత్యం ఇంట్లో చక్కెరను వాడుతూ ఉంటాం. చక్కెర అత్యంత హానికరమైన ఆహార పదార్ధం అని వైద్యులు చెబుతున్నారు. చక్కెర గ్లూకోజ్ స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, శరీరంలో కొవ్వు పెరగడానికి కారణం అవుతుందని, ఇది గుండె జబ్బులకు కూడా కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు చక్కెర వినియోగాన్ని తగ్గించాలి అని సూచిస్తున్నారు. చక్కెర ఎక్కువగా ఉపయోగించడం వల్ల మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చక్కెరకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆహారపదార్ధాలలో తేనె వాడుకోవాలని సూచిస్తున్నారు.

ఉప్పు విషయంలో జాగ్రత్త .. ఎక్కువ ఉప్పు వాడకం డేంజర్

ఉప్పు విషయంలో జాగ్రత్త .. ఎక్కువ ఉప్పు వాడకం డేంజర్

మన రక్తపోటును నియంత్రించడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎక్కువ ఉప్పును తింటే, మీకు అధిక రక్తపోటు మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచంలోని మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా చెబుతున్నారు. కాబట్టి ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో సోడియం స్థాయిలను గమనించాలని చెబుతున్నారు. రోజుకు కేవలం 3.75 గ్రాముల సోడియం తగినంత మరియు సురక్షితమైన మొత్తంగా సూచిస్తున్నారు. 6 గ్రాముల కంటే ఎక్కువ ఏదైనా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

వంటనూనె వినియోగంలో అజాగ్రత్తగా ఉంటే అంతే

వంటనూనె వినియోగంలో అజాగ్రత్తగా ఉంటే అంతే

ఇక మనం ఆహారంలో ఉపయోగించే వంట నూనె విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వంటనూనె విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేరుశెనగ నూనె, రిఫైన్డ్ నూనెలకు బదులుగా, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఆహారంలో ఉపయోగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. సరైన వంట నూనె వినియోగం ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని చెబుతున్నారు. అలాగే విపరీతంగా నూనె వాడకం కూడా తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందని సూచిస్తున్నారు.

English summary
Doctors warn that health is in danger with the consumption of too much salt, sugar and oil in food. It is suggested to reduce the ingredients use as much as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X