వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బల్లాళేశ్వర్ గణేశుడి విశిష్టత.. దాని పురాణ గాథ..

|
Google Oneindia TeluguNews

సంతనాన్నిచే శ్రీ బల్లాళేశ్వర్ - పాలిలోని వినాయకుడు

పూర్వము సింధు దేశములో ప్రసిద్ధి చెందిన 'వల్లీ అనే నగరం ఉండేది. (ఆ వల్లీ నగరమే కాలాంతరములో ఇప్పడు "పాలీ"గా మారినది)

ఆ పట్టణములో కల్యాణ్ అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాల ధనికుడు, భగవద్భక్తి కలవాడు. లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఆయన భార్య ఇందుమతి మహా పతివ్రత, సౌందర్యవతి. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బల్లాల్ అని నామకరణం చేశారు.

అతడు చిన్న వయస్సునుండియే, గణపతిభక్తుడైయుండెను. బల్లాల్ ఒకనాడు తనతోడి బాలకులతోఅడవికి వెల్లెను. అచ్చట బల్లాల్ ఒక పెద్ద రాయిని చూచి, దానిని గణపతివిగ్రహముగా భావించి, ప్రాణప్రతిష్టచేసి, పిల్లలందరితో కలిసి పూజలు చేయనారంభించెను.

History of Ballaleshwar Temple and its significance

అందరూ ఆ గణపతి విగ్రహమునకు బిల్వపత్రములతోను, దూర్వాయుగ్మముతోను పూజలు చేసిరి. జై గజానన్, జై గజానన్ అను నాదములు చేయుచు, చక్కని పాటలు పాడుచు, నృత్యములు చేయుచు, భక్తి పారవశ్యములో ఆకలి దప్పులను, వారి యిళ్ళను మరచిరి. కొన్ని రోజులు గడచినవి. కాని ఆ బాలురెవ్వరును తమయిండ్లకు తిరిగి రాలేదు.

ఆ బాలుర తల్లిదండ్రులు చాల భయపడి కల్యాణ్వర్తకుని యింటికి వెళ్ళి తమ పిల్లలు ఇండ్లకు తిరిగి రాలేదని, బల్లాల్ వారందరిని ఎక్కడకో శ్రీసికొని వెళ్ళాడని, అతనిని నివారింపుమని, దుఃఖముతోను, భయముతోను, రోషపూరితముగాను మాట్లాడిరి. కల్యాణ్ వర్తకుడు కోపించిన వాడై, ఆ గ్రామముబయట పిల్లలందరు పూజ చేసికొనుచున్న ప్రదేశమునకు వెళ్ళి వారిపై ఆగ్రహించెను. పిల్లలందరును భయముతో పారిపోయిరి.

కాని, బల్లాల్ మాత్రము తన ధ్యానములో నిమగ్నుడై యుండెను. ఆ వర్తకుడు కోపముతో బల్లాల్ను కొట్టి, చెట్టుకు కట్టి, గణపతి విగ్రహముగాపూజలు పొందుచున్న రాయిని పారవేసెను. అప్పడు పిల్లవాడైన బల్లాల్ విఘ్నేశ్వరుని మనస్సులో తలచుకొని, "నీవు విఘ్నహర్తవే, మరి నాయిూ పూజకు విఘ్నమెందుకు కలుగచేయుచున్నావు?" అని అడిగెను. తనను కొట్టినందుకు తండ్రి పై అతనికి ఇంచుకైనను కోపము రాలేదు.

కాని గణపతివిగ్రహము పారవేయుట చూచి, సహింపలేక ఎవరు యిటు చేసిరో, వారు గ్రుడ్డి, చెవుడు, మూగ, గూని అగునని శపించెను. గణపతి పిల్లవాని భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణపిల్లవానివలె దర్శనమిచ్చెను. అతనిశరీరమును తాకెను. వెంటనే అతనిశరీరములోని నొప్పలన్నియుపోయి, అది బలమైన శరీరముగా మారినది.

బల్లాల్ ఆ బ్రాహ్మణ బాలకుని విఘ్నేశ్వరుడని గ్రహించి, అతనిని పూజించెను. విఘ్నేశ్వరుడు సంతసించి బల్లాల్ ను వరము కోరుకొనుమనెను. విఘ్నేశ్వరునియందు అనన్యభక్తి కలిగి యుండునట్లను, ఆ స్థలమునందు విఫే్నుశ్వరుడు ఎల్లప్పడు వసించి, ప్రజల కష్టములను నివారణ చేయవలెననియు బల్లాల్వరమును కోరెను.

వినాయకుడు అంగీకరించి, బల్లాలేశ్వర్ నామముతో స్వయంభూ విగ్రహరూపమును దాల్చి, అప్పటినుండియు భక్తుల కోర్కెలను, కష్టములను తీర్చుచుండెను. బల్లాల్ తన తండ్రిచే పారవేయబడిన రాతిని, డుండి వినాయక నామముతో అచ్చట ప్రతిష్టించెను. తరువాత, బల్లాల్ అచ్చట సర్వాంగ సుందరమైన మందిరమును గూడ నిర్మించెను.

పరమ పావనమూ, శుభకరమూ అయిన ఈ చరిత్రను శ్రద్ధా భక్తులతో ఎవరు ఆలకిస్తారో వారు సర్వ పాపములనుండియు విముక్తులై, తమ మనో భీష్టములను పొందుతారు.

ఈ పురాణగాథ, ఫలశ్రుతి గణేశ పురాణములో 22, 23 అధ్యాయములలో చెప్పబడినవి. గమనిక : శ్రీ బల్లాఖేశ్వర దేవాలయమున్న "పాలి" గ్రామము పూణేకు 111 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఇది రాయగడ్ జిల్లాలోని శుద్దగడ్తాలుకాలో ఉన్నది.

సమస్యలు తీర్చే సఙ్కటనాశన గణేశ స్తోత్రమ్‌
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్‌
1ప్రథమం వక్రతుణ్డం చ, ఏకదన్తం ద్వితీయకమ్‌,
తృతీయం కృష్ణపిఙ్గాక్షం, గజవక్త్రం చతుర్థకమ్‌.
2లమ్బోదరం పఞ్చమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టకమ్‌.
3నవమం ఫాలచన్ద్రం చ, దశమం తు వినాయకమ్‌,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్‌.
4ద్వాదశైతాని నామాని, త్రిసన్ధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం పరం!
5విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్‌,
పుత్రార్థీ లభతే పుత్రాన్‌, మోక్షార్థీ లభతే గతిమ్‌.
6జపేత్‌ గణపతి స్తోత్రమ్‌, షడ్భిర్మాసైః ఫలం లభేత్‌,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
7అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్‌,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థ సిద్ధయే.
తస్య విద్యా భవేత్‌ సర్వా, గణేశస్య ప్రసాదతః.
8ఇతి శ్రీ నారదపురాణే సఙ్కటనాశన గణేశ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్‌.

English summary
India is a country which is recognized for its unity in diversity. This diversity is seen in everything, especially in the religions, religious practices and beliefs. Lord Ganesha, the elephant faced God is believed and respected all over India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X