Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్చి నెలాఖరు వరకు ఈ రాశులవారికి తిరుగులేదని చెప్పిన బుధ కేతువులు

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా చెబుతారు. కేతువు ని నీడ గ్రహం గాను, చెడు చేసే గ్రహంగా ను చెబుతారు. అటువంటి బుధ కేతువులు పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల మార్చి నెలాఖరు వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా ఆరు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధున రాశి

మిధున రాశి జాతకులకు రాశికి అధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో కేతువుతో కలవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక అభివృద్ధికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఆస్తి లాభాలు కలుగుతాయి. మంచి ఆదాయం వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

horoscope Budh Ketu conjunction gives good fortune to six zodiac signs till the end of march month

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ధన స్థానంలో ఉన్న కేతువు బుధుడిని వీక్షించడం వల్ల ఈ సమయంలో వీరు ఏ పని చేపట్టినా లాభదాయకంగా మారుతుంది. కర్కాటక రాశి వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ లు, మరియు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబ పరంగా ఆదాయం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలను మించుతాయి.

సింహరాశి

సింహరాశిలో ఉన్న కేతువును బుధుడు వీక్షించడం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ఏ ప్రయత్నం అయినా సరే లాభదాయకంగా ఉంటుంది. షేర్ లతో సహా అనేక మార్గాల ద్వారా మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై, ఆస్తుల విలువ పెరుగుతుంది.

తులారాశి

తులారాశికి లాభ స్థానంలో ఉన్న కేతువు బుధుడిని చూడడం వల్ల తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. రావలసిన డబ్బు తో పాటు, రాదనుకున్న డబ్బు కూడా తులా రాశి వారి చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగుల జీతభత్యాలు, వృత్తి వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. లాటరీలు గెలిచే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి భాగ్య స్థానంలో కేతువుతో బుధుడికి సంసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ధనుస్సు రాశి వారు ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం ఉంది. తండ్రి తరపు వారికి ఆస్తి కలిసి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ లు లాభాలను ఇస్తాయి.

కుంభరాశి

కుంభరాశిలో ఉన్న బుధుడు, సప్తమ స్థానంలోని కేతువును సంసప్తక దృష్టితో చూడడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక మార్గాలతో ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలను ఇస్తాయి. కుంభ రాశి వారికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. ఆస్తిపాస్తులు విలువ గణనీయంగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహ యోగం ఉంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+