మేషరాశి, వృషభరాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశి వారికి మే నెలలో కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో చేసే పనులన్నీ ఈ నెలలో సఫలమవుతాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే, సహోద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. విదేశీ యానానికి లేదా దూర ప్రయాణాలకు ధనం ఖర్చయ్యే అవకాశం ఉంది.

Horoscope Predictions and results for these signs aries and taurus for the Month of May

ఉత్సాహంగా ఉంటారు కానీ ఎండ ప్రభావం వల్ల నీరసం లేదా కంటి సంబంధిత చిన్నపాటి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి అవసరం.జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, పేదలకు ఎర్రటి వస్త్రం లేదా బెల్లం దానం చేయడం శుభప్రదం.

వృషభ రాశి (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)

వృషభ రాశి వారికి మే నెల ఆర్థిక పురోగతిని, వ్యక్తిగత ఆనందాన్ని ఇస్తుంది. మీ రాశిలో రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వృత్తిపరంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఈ నెలలో సంభవిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ధన యోగం బలంగా ఉంది. ఖరీదైన వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొంతకాలం వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆహార విషయంలో నియంత్రణ పాటించడం మంచిది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుండి ఆస్తి సంబంధిత లాభాలు కలగొచ్చు. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, శుక్ర గ్రహానికి దీపారాధన చేయడం వల్ల సర్వ కార్యసిద్ధి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+