పుర్వాషాడ నక్షత్రంలో జన్మిస్తే: మేధావులు అవుతారా ?
హైదరాబాద్: ఏ పాదంలో పుట్టినా పూర్వాషాఢ జాతకులకు వినయం, ప్రసన్న ముఖం, దానగుణం, అభిమానం, దర్పం, కలిగి ఉంటారు. రాయబారులు. గొడవలు తగ్గించే మంచిమాటలు పలక గలవారు వీరు.
దూరదృష్టి కలిగి ఉంటారు, సత్యశీలత, సంపన్నులతో స్నేహం ఉంటుంది, తల్లి పట్ల అభిమానం భక్తీ ఉంటుంది, ప్రయాణాకాంక్ష, కార్య నిర్వహణ సమర్థత, సూక్ష్మ బుద్ధి, మంచిపేరు, స్వల్ప సంపద ఉంటాయి.
మొదటి పాదంలో పుట్టినవారు: కనులలో ఎరుపురేఖలు, శౌర్యం, ధైర్యం స్వల్ప సుఖం కలుగుతాయి.

రెండవ పాదంలో పుట్టినవారు: వినయం, వాక్ చాతుర్యుం, గ్రహణశక్తి, లౌకికజ్ఞానం, చాకచక్యం వుంటాయి.
మూడవ పాదంలో పుట్టినవారు: దయ, శుచి, శుభ్రత, చపలత్యం, సంపాదన, విలాసాలు, సంపద కలిగి ఉంటారు.
నాలుగవ పాదంలో పుట్టినవారు: వితండవాదం, ఉగ్రస్వభావం, ద్వేషం, పాపకార్యాచరణ, దుడుకుతనం, వుంటాయి. పుష్పభానుడు ఈ నక్షత్రంలో పుట్టారు.












Click it and Unblock the Notifications