నాకు మొగుడొద్దు: పెళ్లయిన 7 రోజులకే వధువు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కేవలం వారం రోజులకే ఓ నవ వధువు.. తన భర్తను వదిలేసి తన స్నేహితురాలితోనే కలిసి ఉంటానంటూ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మీరట్ నగరంలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జానీ పీఎస్ పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు గత కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరు జీవితాంతం కలిసి జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. అంతే కాకుండా వారిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం కాస్తా ఓ యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మండిపడ్డారు.
బలవంతపు పెళ్లి.. ఆపై పెద్ద ట్విస్ట్
యువతి ప్రేమను అంగీకరించని కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం ఆమెకు ఢిల్లీకి చెందిన ఓ యువకుడితో హడావిడిగా పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక ఆమె భర్తతో కలిసి ఢిల్లీలోని అత్తగారింటికి వెళ్లిపోయింది. అయితే కథ ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది. తన ప్రేమికురాలిని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలని భావించిన రెండో యువతి.. పోలీసుల సహాయంతో నేరుగా ఢిల్లీలోని ఆ అత్తగగారింటికి చేరుకుంది. అక్కడి నుంచ తన స్నేహితురాలిని తిరిగి మీరట్‌కు తీసుకువచ్చింది.

అత్తగారింటితో ఎలాంటి గొడవల్లేవ్.. కానీ విడాకులు కావాలి..
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షమైందియ అందులో సదరు నవవధువు మాట్లాడుతూ.."నాకు ఏ అబ్బాయితోనూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించినా వారు వినలేదు. ఇప్పుడు నాకు నా భర్తతో గానీ, నా అత్తగారింటి వారితో గానీ ఎలాంటి గొడవల్లేవ్. వారిపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. కానీ నేను నా స్నేహితురాలితోనే కలిసి జీవించాలనుకుంటున్నాను." అని ఆ యువతి స్పష్టం చేసింది. అంతే కాకుండా తనకు త్వరలోనే విడాకులు కావాలని.. ఈ నిర్ణయం తాను ఎవరి ఒత్తిడి లేకుండా స్వతహాగానే తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతుల ప్రేమ వ్యవహారంపై స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అటు పోలీసులు గానీ.. ఇటు ఇరు కుటుంబాల సభ్యుల గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
'सुहागरात से पहले ही बेचारे दूल्हे के साथ खेला हो गया'
— Raju Sharma journalist (@RajuSharmajour1) July 13, 2026
मेरठ की 2 सहेलियों के समलैंगिक विवाह का मामला सामने आया है. एक युवती के परिजनों ने 6 जुलाई को गाजियाबाद के युवक से शादी कर दी. अगले दिन ही दुल्हन को खुद की पत्नी बताने वाली युवती दूल्हे के घर पुलिस लेकर पहुंच गई. घंटों… pic.twitter.com/PKVuWePCfu












Click it and Unblock the Notifications