• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిధునరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు, పునర్వసు 1,2,3 పాదములలో జన్మించినవారు మిధునరాశికి చెందుతారు.

 How will this Ugadi year be for the people who hold Gemini as Zodiac sign

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి

ఆదాయం - 05 , వ్యయం - 05

రాజ పూజ్యం - 03, అవమానం - 06

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు భాగ్యస్థానమైన ( కుంభం) లో లోహమూర్తిగా ఉంటాడు .. ఆ తర్వాత నవంబర్ 20 వరకు అష్టమంలో సువర్ణ మూర్తిగా ఉండి .. తదనంతరం సంవత్సరం అంతా తొమ్మిదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటాడు.

 How will this Ugadi year be for the people who hold Gemini as Zodiac sign

* శని :- సంవత్సరం అంతా ... అష్టమ స్థానమైన ( మకరరాశి )లో లోహమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 6 , 12 ( వృషభ, వృశ్చిక ) రాశులలో సువర్ణ మూర్తులుగా ఉంటారు.

గురువు :- అశుభత్వం వలన ఉగాది నుండి 19 - నవంబర్ -2021 వరకు అనేక ఆటంకాలు కలుగజేస్తాడు ,

ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి ,

సంతాన సంబంధ అనారోగ్యతలు ,

తోబుట్టువుల వలన న్యాయస్థాన సమస్యలు, కోర్టు కేసులు,

మెదడు నరాలు లేదా రక్తానికి సంబందించిన ఆనారోగ్య ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

20 - నవంబర్ - 2021 నుండి గురువు శుభత్వం వలన మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును.

వారసత్వానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగి .. స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును.

మిధునరాశికి చెందిన సంతానం వలన వారి తల్లిదండ్రులు కూడా 20 -నవంబర్ -2021 తదుపరి మంచి ఫలితాలను పొందుతారు.

అన్ని విధాలుగా గురువు నవంబర్ 20 నుండి అనుకూల ఫలితాలను ఇస్తాడు.

*మిధునరాశి వారికి అష్టమశని ప్రభావం వలన ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాడు.

ఆరోగ్య పరంగా సమస్యలు కొనసాగును.

వృద్ధులైన తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం.

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలెను.

శని దేవునికి జప, శాంతులు జరిపించుకోనుట మంచిది.

* రాహువు - కేతువు వలన వ్యాపార సంబంధమైన, వివాహ సంబంధమైన విషయాల్లో మరియు కోర్టు తగాదాలలో విజయం సాధిస్తారు.

ఈ సంవత్సరం అంతా ఎక్కువగా వృధా ఖర్చులు ఉంటాయి, చేస్తారు .

సంపాధించిన ధనం చేతిలో నిలుపుకోలేరు.

అనుకున్న విధంగా ధనం పొదుపు చేసుకోలేరు.

స్నేహితుల వలన ఆర్ధిక సంబంధిత ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి,

నమ్మక ద్రోహలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త.

ఈతలకు ( స్విమ్మింగ్ ) లకు దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

పాట్నర్ షిప్ వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో ఎక్కువ జాగ్రత్తతో ఉండవలెను.

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాల ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

వృత్తికి సంబంధించిన వ్యవహాములలో విజయాలను సూచిస్తున్నాయి.

ఉన్నత విద్యకు ఎంపిక అవుతారు.

స్వయం కృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు.

స్వగృహ నిర్మాణం కల ఈ సంవత్సరం నెరవేరుతుంది.

సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి. ( దంపతులిరువురి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయి )

ఉద్యోగంలో భాద్యతతో కూడిన అధికారం పెరుగుతుంది.

రాజకీయ జీవితంలో ఇది పరీక్షా కాలం లాగా ఉంటుంది. మౌనం మంచిది. మాట జారకూడదు .

స్వయం కృతాపరాధం వలన కొన్ని బంధాలను నష్ట పోవలసి వస్తుంది.

తొందరపడి మాట్లాడం, నిర్ణయం తీసుకోవడం తీసుకోవద్దు. నోటి దురుసు మంచిదికాదని గ్రహించండి.

సంవత్సర ద్వితీయార్ధంలోజీవితం మరో కొత్త పంధాలో నడుస్తుంది.

మీ పేరు మీద ఉన్న స్థిరాస్తులకు విలువ పెరుగుతుంది.

విలువైన వస్తువులు, ముఖ్య పత్రాలు, సర్టిఫికెట్లు మొదలగు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం,

అశ్రద్ధ వలన ముఖ్యమైనవి పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త .

వ్యవసాయ దారులకు రెండు పంటలు అనుకూలం, లాభాలు ఉంటాయి.

ఉద్యోగస్తులకు అనుకూలమైన స్థాన చలనం ఉంది.

రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే మంచిది.

వ్యాపారస్తులకు ధర్మబద్దత కూడిన .. న్యాయమైన వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి.

మోసపూరితమైన .. తప్పుడు వ్యాపారాలు ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించండి.

విద్యార్ధులు ఎక్కువ శ్రద్ద పెట్టి చదువుకోవాలి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో నిత్యం పూజ చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

English summary
All you need to know about gemini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X